Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. డీజీపీ రవి గుప్తాకు పూర్తి బాధ్యతలు.. ఎప్పటివరకంటే?
తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.తెలంగాణ డీజీపీగా రవిగుప్తా మరో ఏడాదిన్నరపాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సీఐడీ సీఐడీ చీఫ్‌గా శిఖా గోయల్..
తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.తెలంగాణ డీజీపీగా రవిగుప్తా మరో ఏడాదిన్నరపాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సీఐడీ సీఐడీ చీఫ్‌గా శిఖా గోయల్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, తెలంగాణ స్పెషల్ ఫోర్స్ డీజీగా అనిల్‌కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషి, ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌రెడ్డిగా బదిలీ అయ్యారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా రాజీవ్ రతన్‌కు బాధ్యతలు అప్పగించారు.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే..
- ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌రెడ్డి
- ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి
- సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్‌చంద్ర పవార్
- సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు
- హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ
- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమేష్
- ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్
- ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా కమలాసన్
- జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా
- పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్
- విజిలెన్స్ డీజీగా రాజీవ్‌రతన్
- ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా అంజనీకుమార్
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…