12 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర.. ఆ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్!
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం 3,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో మొదటి విడతగా1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నియామకాల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తాజాగా కొన్ని ప్రతిపాదనలు పంపింది. ఇందులో ఆర్టీసీ కీలక అంశాలను ప్రస్థావించింది. 2013 నుంచి ఆర్టీసీలో కండక్టర్ల నియామకాలు లేకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ప్రస్తుతం సేవలు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
అంతేకాకుండా ప్రతి ఏడాది ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని.. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగినట్టు ఆర్టీసీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంస్థను సజావుగా నడుపడం ఇబ్బందిగా మారిందని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకొని కొత్త నియామకాలకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది.
అయితే నిజానికి సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కూడా కలిపి మొత్తం 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ముందుగా కండక్టర్ అనుమతులు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
