Holidays: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉపాధ్యాయలకు వేసవి సెలవుల పెంపు..

Holidays: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు వేసవి సెలవులను పొడిగించింది. ప్రస్తుతం ఉన్న తేదీ నుంచి ఈనె 20వ తేదీ...

Holidays: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉపాధ్యాయలకు వేసవి సెలవుల పెంపు..
Telangana Govt
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 15, 2021 | 9:50 PM

Holidays: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు వేసవి సెలవులను పొడిగించింది. ప్రస్తుతం ఉన్న తేదీ నుంచి ఈనె 20వ తేదీ వరకు సెలవులను పొడిగించాలని ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవులను మొదట 15-06-2021 వరకు ఇచ్చారు. అయితే ప్రస్తుతం వీటిని పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, డైట్ కళాశాలకు సెలవులను, డైట్ కళాశాలలకు సెలవులను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రంలోని అన్ని విభాగాధిపతులు, పాఠశాల విద్య హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, రాష్ట్రంలోని అన్ని డైట్ కాలేజీల ప్రిన్సిపాల్స్ దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో పాఠశాలలు మూసివేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సేలవులు ఇచ్చారు. వాటిని ఇప్పుడు మళ్లీ పొడిగించారు.

Also read:

Eating Breakfast After Bath: ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి