AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్ఎంసీలో లక్ష మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ.. పర్యావరణంపై అవగాహన..

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం పర్యావరణంపై అవగహన కల్పించేందుకు TSPCB చైర్మన్ తో కలిసి మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు.

జీహెచ్ఎంసీలో లక్ష మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ.. పర్యావరణంపై అవగాహన..
Hyderabad
Sravan Kumar B
| Edited By: |

Updated on: Aug 21, 2024 | 6:36 PM

Share

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం పర్యావరణంపై అవగహన కల్పించేందుకు TSPCB చైర్మన్ తో కలిసి మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవిశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, TSPCB మెంబర్ కార్యదర్శి రవి, చీఫ్ ఇంజనీర్ రఘు, తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్ట్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసేన విగ్రహాల వలన పర్యావరణానికి ప్రమాదం ఉందని గుర్తుచేశారు. వీటి స్థానంలో మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని సీఎస్ శాంతికుమారి అన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 అంగుళాల మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. GHMC పరిధిలో ఒక లక్ష విగ్రహాల పంపిణీకి సిద్దమయ్యారు. దీంతో పాటూ తెలంగాణలోని 32 జిల్లాలకు 64 వేల విగ్రహాలను అందించేందుకు సిద్దమయ్యారు. పర్యావరణంపై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు నిర్వహంచడం జరుగుతుందని సీఎస్ తెలిపారు.

అవగాహన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్లను ఆటోట్రాలీల ద్వారా ప్రదర్శించనున్నారు. పర్యావరణహితమైన సందేశాలతో ప్రింట్ అండ్ ఎలక్ట్రనిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈమేరకు TSPCB సిద్దమౌతోంది. మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణపై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ ఇవ్వనన్నారు. GHMC పరిధిలో ఆటోల వెనుక పోస్టర్ల ప్రదర్శన, బస్‎స్టాప్‎లలో హోర్డింగ్‎లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద మట్టి గణపతులపై పెద్ద ఎత్తున షార్ట్ ఫిలిం ఆడియో క్లిప్‎ల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..