అంతర పంటగా 50 మొక్కలు పెంచాడు.. చివరకు దూలతీరింది.. అసలేం జరిగిందంటే..

తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ అతని కొంపముంచింది.. అటవీ ప్రాంతం.. పైగా.. మహారాష్ట్ర పక్కనే ఉండటం.. ఇక మనకెవరు అడ్డు అనుకున్నాడు.. ఏజెన్సీ ప్రాంతంలో ఎవరూ పట్టించుకోరులే అనుకుని.. మంచిగా..

అంతర పంటగా 50 మొక్కలు పెంచాడు.. చివరకు దూలతీరింది.. అసలేం జరిగిందంటే..
Ganja Plans (Representative image)
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 21, 2024 | 6:27 PM

తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ అతని కొంపముంచింది.. అటవీ ప్రాంతం.. పైగా.. మహారాష్ట్ర పక్కనే ఉండటం.. ఇక మనకెవరు అడ్డు అనుకున్నాడు.. ఏజెన్సీ ప్రాంతంలో ఎవరూ పట్టించుకోరులే అనుకుని.. మంచిగా గంజాయ్ సాగు చేశాడు.. కట్ చేస్తే.. కోర్టు అతనికి దిమ్మతిరిగేలా షాకిచ్చింది.. నిషేధిత గంజాయి చెట్లను సాగు చేసిన ఓ వ్యక్తికి ఆగస్టు 20వ తేదీ మంగళవారం ఆసిఫాబాద్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు దోషికి కోర్టు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. 2021లో పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా కోర్టు శిక్ష విధించింది..

అసలేం జరిగిందంటే.. కుమురమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ గ్రామానికి చెందిన చునార్కర్ ముకుందరావు అనే వ్యక్తి.. తన పంట పొలంలో గంజాయ్ సాగు చేశాడు.. ఎక్కువ సంపాదించాలనే ఆశతో తన పంటపొలంలో అంతరపంటగా గంజాయ్ సాగుచేశాడు.. 2021 అక్టోబర్ లో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. పొలంలో పరిశీలించగా.. 50 గంజాయ్ మొక్కలు కనిపించాయి.. ఆ తర్వాత పోలీసులు గంజాయ్ సాగును ధ్వంసం చేసి.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పొలంలో 50 గంజాయి చెట్లను పెంచినట్లు ఆధారాలను కోర్టులో సమర్పించారు.. ముకుందరావును దోషిగా తేల్చిన ధర్మాసనం.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 1 లక్ష జరిమానా కూడా విధించింది.

దోషికి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్ ఈ శిక్షను ఖరారు చేశారు. తీర్పు అనంతరం ఆసిఫాబాద్ పోలీసు సూపరింటెండెంట్ డివి శ్రీనివాసరావు, డిఎస్పీ పి సదయ్య, ఆసిఫాబాద్ ఇన్‌స్పెక్టర్ జి సతీష్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఆర్ నారాయణను.. అభినందించారు. ముకుందరావు దోషిగా నిర్ధారించేందుకు త్వరతగతిని సాక్ష్యాలను సమర్పించడంలో వీరంతా కృషిచేసినట్లు ఎస్పీ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..