AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telagana: మందుబాబులకు బ్యాడ్​ న్యూస్​​ – లిక్కర్ ధరలు పెంపు..!

తెలంగాణలో లిక్కర్‌ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే బిగ్ రిలీఫ్ ఏంటి అంటే.. చీఫ్‌ లిక్కర్‌కు ధరల పెంపు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుందట. ధరల పెంపుపై బేవరేజిస్‌ కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

Telagana: మందుబాబులకు బ్యాడ్​ న్యూస్​​ - లిక్కర్ ధరలు పెంపు..!
Liquor
Ram Naramaneni
|

Updated on: Apr 17, 2025 | 9:07 AM

Share

తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలే బీర్ల ధరలు పెరగ్గా.. తాజాగా ఇతర లిక్కర్ ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అయితే బడుగు వర్గాలు ఎక్కువగా సేవించే.. చిఫ్‌ లిక్కర్‌ ధరలో ఎలాంటి సవరణ ఉండదని సమాచారం. ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్‌ పైనే.. కాస్త పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై మదింపు జరుగుతుంది. ఎంఆర్పీ ధర ఆధారంగా రేట్ల పెంపు ఉంటుంది. బాటిల్ రేటు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం 10 శాతం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. రెండు, మూడు రకాల ధరల పెంపు ప్రపోజల్స్ అధికారులు ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. ఆయా విధానాల్లో ఎంత ఆదాయం సమకూరుతుందో కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు. వాటిపై ప్రభుత్వం రివ్యూ చేసి.. ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంటుంది. లిక్కర్‌పై రేట్ల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఏడాదికి రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుంది అన్నది అధికారుల అంచనా.

ఫిబ్రవరి నెలలో తెలంగాణలో బీర్ల రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. దాదాపు 15 శాతం వరకు రేట్లు పెంచారు. ఈ ధరల పెరగడంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. గతంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు పెరగడంతో… రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత బీర్ల ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. లిక్కర్ సప్లై చేసే కంపెనీల నుంచి విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలపై రీసెర్చ్ చేసిన కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడంతో 15 శాతం ధరలు పెంచుకోవచ్చని చెప్పింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..