AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justice Madan B Lokur: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విచారణ కమిషన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమించింది. కమిషన్ చైర్మన్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు సూచనలు, సలహాలు చేసింది. ఆ తర్వాత అప్పటివరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ నరసింహారెడ్డి .. విచారణ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

Justice Madan B Lokur: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్
Justice Madan B Lokur
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2024 | 5:08 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విచారణ కమిషన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమించింది. కమిషన్ చైర్మన్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు సూచనలు, సలహాలు చేసింది. ఆ తర్వాత అప్పటివరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ నరసింహారెడ్డి .. విచారణ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా.. 2011లో ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోకూర్ పని చేశారు. ఇక ఇప్పటినుంచి జస్టిస్ లోకూర్ గతంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరపనున్నారు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ విద్యుత్ అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు ఇంతకు ముందు ఛైర్మన్‌గా జస్టిస్‌ నరసింహారెడ్డి వ్యవహరించారు. విచారణ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ని తమ ముందు హాజరుకావాలని కోరారు. అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు. ఆయనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో సుప్రీంకోర్టులో కేసీఆర్ వాదనకు బలం చేకూరింది. దీంతో నరసింహారెడ్డి విచారణ కమిటీ నుంచి వైదొలిగారు..

అయితే.. ఇప్పుడు ప్రభుత్వం జస్టిస్ లోకూర్‌ని నియమించింది కాబట్టి.. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కమిషన్‌ విచారణ పూర్తయింది. మరి ఇప్పటికి వరకు జరిగిన విచారణను లోకూర్ కొనసాగిస్తారా..? మళ్లీ మొదటి నుంచి విచారణ స్టార్ట్‌ చేస్తారా? లేదంటే గత చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి మాదిరిగానే కేసీఆర్‌ని కమిషన్ ముందు హాజరు కావాలని కోరతారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..