AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు రద్దు!

ప్రభుత్వం అర్హులకే ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో పక్కగా చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకూ ఈ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. వారు అప్‌లోడ్ చేసిన ఫొటోల ఆధారంగా, ముందుగానే బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి కూడా అప్రూవల్స్ లభించాయి. ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ సీరియస్‌గా తీసుకున్నారు.

Telangana: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు రద్దు!
Indiramma Houses
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 01, 2025 | 10:23 AM

Share

తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందరికీ తెలిసిందే..! తొలి విడతలో ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ ఇళ్లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. వచ్చే ఆగస్టు 15 నాటికి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి, ఒకేసారి భారీ స్థాయిలో గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధతలో ఉన్నారు.

అయితే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 1,950 మంది అనర్హులు ఈ పథకం ద్వారా ఇళ్లు పొందినట్లు గుర్తించారు. దీంతో అధికారుల నిర్ణయంపై చర్యలు తీసుకుంటూ, వారి ఇళ్లను రద్దు చేశారు. మరోవైపు శాఖపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు.

ప్రభుత్వం అర్హులకే ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో పక్కగా చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకూ ఈ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. వారు అప్‌లోడ్ చేసిన ఫొటోల ఆధారంగా, ముందుగానే బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి కూడా అప్రూవల్స్ లభించాయి. ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ సీరియస్‌గా తీసుకున్నారు. బేస్‌మెంట్ పూర్తయిన తరువాత తొలి విడతలో రూ. లక్ష చెల్లించే సమయంలో ఈ అనర్హులను గుర్తించినట్లు ఎండీ గౌతమ్ తెలిపారు. వెంటనే వీరికి మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసి, వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. అంతేకాక, దీనికి బాధ్యులైన పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

మొదటి విడతలో సొంత భూమి ఉండి, ఇల్లు లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని గౌతమ్ స్పష్టం చేశారు. కానీ తనిఖీల్లో బయటపడిన 1,950 మంది గతంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించి బేస్‌మెంట్ వరకూ నిర్మించారని పేర్కొన్నారు. అధికారుల తనిఖీల ప్రకారం, పథకం కింద దశల వారీగా అనేక స్థాయిల్లో పరిశీలన, అనంతరం కలెక్టర్ ఆమోదం ద్వారా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం జరుగుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. అయినప్పటికీ కొన్ని చోట్ల గల అలసత్వం వల్ల అనర్హులకు కూడా ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు. ఈ అంశంపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ, పథకం నిజమైన అర్హుల చేతికి చేరేలా చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ