ఎటూ తేలని 60 వేల ఇంటర్ విద్యార్థుల ఫ్యూచర్.. బోర్డు ఏమంటోంది ?
తెలంగాణాలో దాదాపు 60వేల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరు చదువుతున్న 159 జూనియర్ కాలేజీలకు అనుబంధ ప్రతిపత్తిని మంజూరు చేయడంలో జాప్యం జరగడమే ఇందుకు కారణం.. వచ్ఛే ఏడాది జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు వీరు హాజరు కాగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా… ఈ కళాశాలల ఫ్యూచర్ పై తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా నిర్ణయం తీసుకోవలసి ఉంది. పరీక్షల నోటిఫికేషన్ ను ఈ బోర్డు ఈ నెల 26 న […]
తెలంగాణాలో దాదాపు 60వేల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరు చదువుతున్న 159 జూనియర్ కాలేజీలకు అనుబంధ ప్రతిపత్తిని మంజూరు చేయడంలో జాప్యం జరగడమే ఇందుకు కారణం.. వచ్ఛే ఏడాది జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు వీరు హాజరు కాగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా… ఈ కళాశాలల ఫ్యూచర్ పై తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా నిర్ణయం తీసుకోవలసి ఉంది. పరీక్షల నోటిఫికేషన్ ను ఈ బోర్డు ఈ నెల 26 న విడుదల చేసింది. ఈ కాలేజీలు వివిధ డాక్యుమెంట్లను ఇంకా సమర్పించని కారణంగా అనుబంధ ప్రతిపత్తిని కల్పించడంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నామని బోర్డు అధికారులు చెబుతుండగా.. విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియను తాము ఎప్పుడో పూర్తి చేశామని, అలాంటప్పుడు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడమేమిటని ఈ కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. ఇది బోర్డు తప్పిదమేనని ఆరోపిస్తున్నాయి. ఈ కళాశాలల్లో ఒక్కో కాలేజీ నుంచి కనీసం 400 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారని, వీరితో బాటు ఇతర విద్యార్థుల ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకుని బోర్డు త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కళాశాలల మేనేజిమెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా- ఒకటి రెండు రోజుల్లో ఈ ‘ సమస్య ‘ పరిష్కారం కాగలదని బోర్డు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.