చెన్నైలో బతుకమ్మ సంబురాలు.. ఆటపాటలతో ఆడపడుచుల సందడి..!

చెన్నైలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లా పాపలు, మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. వరంగల్‌ జిల్లాకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. ప్యారీస్‌, షాపుకారుపేట, బ్రాడ్‌ వే, ఉత్తర చెన్నై తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, చిన్నా చితక వ్యాపారులు అక్కడే ఉంటున్నారు. అయితే కులాలకు అతీతంగా తెలంగాణ సంఘాన్ని ఏర్పాటు చేసి గత […]

చెన్నైలో బతుకమ్మ సంబురాలు.. ఆటపాటలతో ఆడపడుచుల సందడి..!
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 12:33 PM

చెన్నైలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లా పాపలు, మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. వరంగల్‌ జిల్లాకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. ప్యారీస్‌, షాపుకారుపేట, బ్రాడ్‌ వే, ఉత్తర చెన్నై తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, చిన్నా చితక వ్యాపారులు అక్కడే ఉంటున్నారు. అయితే కులాలకు అతీతంగా తెలంగాణ సంఘాన్ని ఏర్పాటు చేసి గత ఏడేళ్లుగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మలే కాదు… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను కూడా వారంతా ఘనంగా జరుపుకుంటారు.

ప్రతి ఏడాది విరాళాలు సేకరించి.. బతుకమ్మ వేడుకలను జరుపుతుంటారు. మైదానంలో తీరొక్క పూలతో కొలువుదీరిన బతుకమ్మలు, ఆటపాటలు… డీజేల హోరుల మధ్య అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ వారితో పాటు.. తమిళనాడుకు చెందిన వారు కూడా ఈ సంబురాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..