Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer Rates: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్! తెలంగాణలో బీర్ రేట్ ఎంత పెరగనుందో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత, తెలంగాణలో మద్యం ఆదాయం తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Beer Rates: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్! తెలంగాణలో బీర్ రేట్ ఎంత పెరగనుందో తెలుసా..?
Beer
Follow us
Vijay Saatha

| Edited By: Balaraju Goud

Updated on: Nov 05, 2024 | 10:37 AM

తెలంగాణలోని మద్యం నిల్వల పరిశీలనను ఎక్సైజ్ అధికారులు చేపట్టినట్లు తెలుస్తోంది. సర్కార్ అనుమతిస్తే ధరలు పెంచే దిశగా సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో మద్యం విక్రయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశముందని తెలుస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మద్యం ధరల విధానాలు తెలంగాణలోని మద్యం విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల, తెలంగాణ ఎక్సైజ్ శాఖ బీరు బాటిల్ ధరలో రూ. 20 నుండి రూ. 50 వరకు పెంపును అనుమతించింది. కానీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంది. అయినప్పటికీ, బీరు ధరలు పెరగడం వల్ల మార్కెట్ డిమాండ్ తగ్గవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలపై సమీక్ష చేసిన అధికారులు, అక్కడి అధిక ధరలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణలో కూడా బీరు ధరలను సవరిస్తే, డిమాండ్ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని బీరు తయారీ సంస్థలు ప్రస్తుత ఖర్చులు, విస్తృత దశలలో పెరిగిన ధరలను చూపిస్తూ, 20-25% ధర పెంపు కోరాయి. అయితే , తెలంగాణ ప్రభుత్వం సరిహద్దులపై కూడా దృష్టి పెట్టింది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మద్యం ధరల కారణంగా అనేకమంది మద్యం వినియోగదారులు సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత, మద్యం ఆదాయం తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై బీరు ధరల నిర్ణయంపై ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, ఇది గత కొన్నేళ్లలో బీరు ధరలను పెంచిన మూడోవసారి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2014లో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాల 10 వేల కోట్ల రూపాయలు. ఈ ఏడాది మద్యం ద్వారా సమకూరిన ఆదాయం 35 వేల కోట్లు. ఇక వచ్చే ఏడాది నాటికి మద్యం విక్రయాల ద్వారా 45 వేల కోట్లు రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..