Telangana: త్వరలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు.. నిజమేనా..?
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జూలై నెల మొదటి వారంలో కౌన్సిలింగ్ ఉంటుందని ఇప్పటికే ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపు చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఫీజుల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచాయి. దీనిపై సర్కారు ఏ విధంగా స్పందింస్తుందనేది ఉత్కంఠగా మారింది.

తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వాటిలో 19 యూనివర్శిటీ ప్రభుత్వ కాలేజీలు కాగా 154 ప్రైవేటు కళాశాలలు, రెండు ప్రైవేటు ఉన్నాయి. ఈ ఏడాది ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలల్లో ఫీజుల నిర్ధారణపై మాత్రం ఓ క్లారిటీ రాలేదు. ఆయా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఫీజు పెంపునకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలను ఫీజుల నియంత్రణ మండలి (TAFRC ) ముందు పెట్టాయి. ఈ కాలేజీ యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజుల పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అసలు ఈ ఫీజు పెంపుపై కాలేజీల సిఫార్సు ఎంటో తెలిస్తే పేరేంట్స్ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని భావిస్తున్నాయి. దాదాపు 160 కాలేజీల వరకు వారి విజ్ఞప్తులను టీఏఎఫ్ఆర్సీ ముందు పెట్టగా.. కొన్ని కాలేజీలు ఏకంగా 50-80 శాతం ఫీజు పెంపునకు అనుమతి ఇవ్వాలని కోరాయట. సీబీఐటీ తో పాటు మరో 5 కాలేజీలు 2 లక్షలకు మించి ఫీజు ను పెంచాలని కోరాయి. లక్ష నుంచి రెండు లక్షల వరకు ఫీజు కోరుతున్న కళాశాలల సంఖ్య 65 కి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో లక్ష. ఆపై ఫీజు ఉంది. తొలిసారిగా పలు కళాశాలల్లో ఫీజు 2 లక్షల మార్కును చేరుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
మూడేళ్లకోసారి రివైజ్ అయ్యే ఫీజులు ఈ ఏడాది పెంచితే మూడేళ్ల పాటు అవే ఉండనున్నాయి. మరి ఫీజు పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు ఉన్నత విద్యామండలి చెబుతోంది. ఫీజుల ఖరారు ఆలస్యమైనా అడ్మిషన్స్ ప్రక్రియను మాత్రమే జులై మొదటివారంలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే కాలేజిల్లో ఎన్ని సీట్లు అనేది ఫైనల్ కావాల్సి ఉందని.. AICTE అప్రూవల్ రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..