TV9 Network: తెలంగాణ ఏం ఆలోచిస్తోంది.. తెలుగు మీడియా చరిత్రలో మొట్ట మొదటిసారి టీవీ9 మెగా పొలిటికల్ కాంక్లేవ్..
TV9 Political Conclave 2023: తెలంగాణ దంగల్ చివరి అంకానికి చేరుకుంది.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రయత్నిస్తుండగా.. తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.
TV9 Political Conclave 2023: తెలంగాణ దంగల్ చివరి అంకానికి చేరుకుంది.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రయత్నిస్తుండగా.. తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. దీంతో అంతటా ఎన్నికల సందడి నెలకొంది. పార్టీలు హామీల వర్షం కురిపిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మేనిఫెస్టోలతో ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఈ తరుణంలో అసలు తెలంగాణ ఏం ఆలోచిస్తోంది.. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు…? అంటూ తెలుగు నెంబర్‌వన్ ఛానల్.. భారత మీడియా రంగంలో అతిపెద్ద నెట్‌వర్క్.. టీవీ9 మరో మెగా పొలిటికల్ షో నిర్వహించబోతోంది..
తెలంగాణ ఏం ఆలోచిస్తోంది.. తెలంగాణ ఏం కోరుకుంటోంది.. అంటూ మెగా పొలిటికల్ కాంక్లేవ్‌ను టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించబోతుంది.. తెలుగు మీడియా చరిత్రలో మొట్టమొదటి సారి టీవీ9 మెగా పొలిటికల్ కాంక్లేవ్‌ను నిర్వహిస్తోంది. తెలంగాణ ఏం ఆలోచిస్తోంది.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. అనే అంశాలపై సుధీర్ఘ చర్చ నిర్వహించబోతోంది.. ఈ కాంక్లేవ్‌లో ప్రజా సమస్యలు.. అభివృద్ధి, రాజకీయ పరిస్థితులు.. ఇలా అన్ని అంశాల గురించి టీవీ సుధీర్ఘ చర్చ నిర్వహించనుంది. టీవీ9 మెగా పొలిటికల్ కాంక్లేవ్ నవంబర్ 23న (గురువారం) ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..