AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను లేనిది చూసి.. బందిపోట్లలాగా చొరబడి మా నాయకుల్ని తీసుకుపోయారుః పువ్వాడ ఆజయ్

Telangana Assembly Elections: ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణ వేడెక్కి.. పువ్వాడ అజయ్ వర్సెస్ తుమ్మల గా మారింది. ఇటీవల బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లోని చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. పలువురు బీఆర్ఎస్ నేతల్ని.. కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

నేను లేనిది చూసి.. బందిపోట్లలాగా చొరబడి మా నాయకుల్ని తీసుకుపోయారుః పువ్వాడ ఆజయ్
Ponguleti Srinivas Reddy Puvvada Ajay Kumar Thummala Nageswar Rao
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 16, 2023 | 3:41 PM

Share

ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణ వేడెక్కి.. పువ్వాడ అజయ్ వర్సెస్ తుమ్మల గా మారింది. ఇటీవల బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లోని చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. పలువురు బీఆర్ఎస్ నేతల్ని.. కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది. 2014 లో నా చేతిలో ఓడిపోయిన తుమ్మల.. మళ్ళీ ఓడిపోవడం ఖాయమని గెలుపు ధీమా వ్యక్తం చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

ఇప్పటికే పొంగులేటి, తుమ్మల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కీలక నేతలు.. ఇద్దరూ పోటీ చేసే సీట్లపై క్లారిటీ వచ్చింది. ఇంకేముంది.. ఇద్దరూ సైలెంట్‌గా ఖమ్మం లో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఆఖరి నిమిషం వరకు తెలియకుండా గుంభనంగా వ్యవహరించి.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తోపాటు మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పలువురు ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి చర్చలు జరిపారు. వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్లి.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించారు. ఈ పరిణామాలు ఒక్కసారిగా బీఆర్ఎస్‌లో కుదుపుకి గురిచేశాయి. దీంతో హుటాహుటిన మంత్రి పువ్వాడ అజయ్ అధినేత నుంచి బీ-పామ్ అందుకొని.. హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్నారు. ఆగమేఘాల మీద ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. నేతల పార్టీ మార్పుపై విస్తృతంగా చర్చించారు.

బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరిన వారిలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా నారాయణ, సైదుబాబు సహా పలువురు నేతలు ఉన్నారు. ఇంకా మరి కొందరు అధికార పార్టీ నేతలు.. కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్‌లో ఇబ్బందులు, అవమానం జరిగిందని.. సరైన ప్రాధాన్యత గుర్తింపు దక్కడం లేదని అందుకే స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు అసమ్మతి నేతలు. దీని వెనక ఎవరి ఒత్తిడి ,ప్రలిభం లేదని నేతలు మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు ఖమ్మంలో ఆట ఇపుడే మొదలైందంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. భవిష్యత్ లో మిమ్మల్ని ఎవరూ కాపాడ లేరు.. జాగ్రత్తగా పని చేయాలని అధికారులకు తుమ్మల వార్నింగ్ ఇచ్చారు. కబ్జాలు చేసిన ఎవరిని వదిలి పెట్టేదీ లేదని హెచ్చరించారు.

ఇదిలావుంటే మరికొందరు బీఆర్ఎస్ నేతలతో తుమ్మల, పొంగులేటి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ నేతలు కలిసి ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడ్ చేయడంతో.. అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. ఎపుడు ఎవరు పార్టీని వీడతారోనని.. హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో..మంత్రి పువ్వాడ అజయ్.. తుమ్మలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 లో తనపై తుమ్మల పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. 2018 లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు 2023లో ఓడిపోవడం ఖాయమన్నారు పువ్వాడ. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో గెలిచేదీ నేనే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి పువ్వాడ అజయ్. పార్టీ ద్వారా లబ్ది పొంది.. కొందరు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇకపై ఎవరూ బీఆర్ఎస్ పార్టీని వీడరని.. కావాలనే ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని పువ్వాడ దుయ్యబట్టారు. బందిపోట్ల లాగా..ఇళ్లలోకి చొరబడి..నేతల్ని తీసుకొని పోయారని మండిపడ్డారు..

ఇక తుమ్మల టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు పువ్వాడ.. ఓడిపోయిన వ్యక్తిని తీసుకువచ్చిన కేసీఆర్.. ఎమ్మెల్సీ చేసి.. మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. తుమ్మలకు పార్టీ ఏమి తక్కువ చేసిందని ప్రశ్నించారు. జిల్లా పెత్తనం మీ చేతుల్లో పెడితే.. తొమ్మిది మంది ఓడిపోయారన్నారు. ఇపుడు కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజలు తనతోనే ఉన్నారని.. ఖమ్మంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు పువ్వాడ. ఖమ్మం లో రాజకీయ వాతావరణం వేడెక్కి.. తుమ్మల వర్సెస్ పువ్వాడ అజయ్‌గా మారింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..