Telangana Elections: సమీపిస్తున్న ఎన్నికలు.. పార్టీల జెండాలు, కండువాలు సిద్ధం..

Telangana Assembly Election 2023: ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినా.. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినా.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఏవైనా సరే ప్రతి రాజకీయ పార్టీకి ఆ పార్టీ జెండాలు, కండువాలు తప్పనిసరి. అవి లేకుంటే.. ఆ సభలు, సమావేశాలు, సమ్మేళనాలకు రాజకీయ పరమార్థమే లేదు. అందుకే.. ఏ పార్టీ మీటింగ్ కూడా తమ తమ పార్టీల గుర్తుతో జెండాలు, కండువాలు లేకుండా కార్యక్రమాలను నిర్వహించవు. మరి ఆ జెండాల తయారీ ఎలా జరుగుతుంది? ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేతే పార్టీలు ఉపయోగించే కండువాల తయారీతో

Telangana Elections: సమీపిస్తున్న ఎన్నికలు.. పార్టీల జెండాలు, కండువాలు సిద్ధం..
Telangana Political Flags
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Shiva Prajapati

Updated on: Oct 13, 2023 | 1:51 PM

హైదరాబాద్, అక్టోబర్ 13: ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినా.. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినా.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఏవైనా సరే ప్రతి రాజకీయ పార్టీకి ఆ పార్టీ జెండాలు, కండువాలు తప్పనిసరి. అవి లేకుంటే.. ఆ సభలు, సమావేశాలు, సమ్మేళనాలకు రాజకీయ పరమార్థమే లేదు. అందుకే.. ఏ పార్టీ మీటింగ్ కూడా తమ తమ పార్టీల గుర్తుతో జెండాలు, కండువాలు లేకుండా కార్యక్రమాలను నిర్వహించవు. మరి ఆ జెండాల తయారీ ఎలా జరుగుతుంది? ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేతే పార్టీలు ఉపయోగించే కండువాల తయారీతో ఎంత మంది ఉపాధి పొందుతున్నారు? ప్రచార సామగ్రి కోసం రాజకీయ నాయకులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు పెట్టే ఖర్చు ఎంత? ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ మీకోసం..

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రమాణస్వీకారాలు జరిగినా.. పొలిటికల్ పార్టీలకు, వ్యక్తులకు సంబంధించిన ప్రచార సామాగ్రి తయారీ మాత్రం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన.. ఎన్నికలకు మూడు నెలల ముందు నుండి సిటీలో ఎన్నికల ప్రచార సామాగ్రి తయారీ జోరుగా సాగుతాయి. రోజుకు దాదాపు 18 గంటల తయారీ పని జరుగుతుంది.

పార్టీల ప్రచార సామాగ్రి తయారీ ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌తో పాటు హైదరాబాద్‌లో కూడా జరుగుతుంది. రానున్న ఎన్నికల కోసం సిటీలో దాదాపు అన్ని పార్టీల కోసం.. కాంగ్రెస్, బిజెపి, టీడీపీ, బిఆర్‌ఎస్ తదితర పార్టీల అభ్యర్థుల కోసం, పార్టీల కోసం జెండాలు, కండువాలు తయారు చేస్తున్నారు వ్యాపారులు. దీంతో సిటీలో దాదాపు 500 మంది ఉపాధి పొందుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే పది రోజుల ముందు, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజుకి 20 గంటలు పాటు లక్ష్యల సంఖ్యలో పార్టీ కండువాలు, జెండాలు తయారీ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

దాదాపు 20 సంవత్సరాల నుండి వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచార సామాగ్రి తయారీలో ఉన్నామని చెబుతున్నారు వ్యాపారులు. అందుకే ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి సామాగ్రి తయారీ కోసం ముడిసరుకు తెచ్చి పెట్టుకుంటాం. ఆర్డర్ ఇచ్చి డబ్బులు చెల్లించడమే ఆలస్యం పని మొదలు పెడతామంటున్నారు వ్యాపారులు. కొన్ని సార్లు రిటైల్ వ్యాపారుల నుండి కూడా ఆర్డర్లు చేసుకుంటామని అంటున్నారు వ్యాపారులు.

ఇక్కడ జెండా తయారీ కండువాలు తయారీ మొదలు పెట్టినప్పటి నుండి దాదాపు 500 మంది ఉపాధి పొందుతున్నారు, ఇందులో కొందరు విద్యార్థులు చదువుల కోసం పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బిజినెస్ బాగా జరిగింది దాదాపు రూ. 80 లక్షల బిజినెస్ జరిగింది. రానున్న ఎన్నికల కోసం ఎక్కువ సంఖ్యలో జెండాలు తయారు చేస్తామని అంటున్నారు వ్యాపారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..