KTR in Siricilla: సిరిసిల్ల మళ్లీ ఆయన వెంటే.. బీజేపీ, కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు కరువు..!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.టీ.రామారావు మరోసారి సిరిసిల్ల నియోజకవర్గం నుంచీ పోటీకి రెఢి అయ్యారు. ఇక్కడి నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు.. అయితే ఈసారి.. లక్షకుపైగా మెజారిటితో పక్కా అంటూ ధీమాతో ముందుకు వెళ్తున్నారు. అయితే కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు సరియైన లీడర్ లేక ప్రతిపక్షాలు డీలాపడుతున్నాయి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.టీ.రామారావు మరోసారి సిరిసిల్ల నియోజకవర్గం నుంచీ పోటీకి రెఢి అయ్యారు. ఇక్కడి నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు.. అయితే ఈసారి.. లక్షకుపైగా మెజారిటితో పక్కా అంటూ ధీమాతో ముందుకు వెళ్తున్నారు. అయితే కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు సరియైన లీడర్ లేక ప్రతిపక్షాలు డీలాపడుతున్నాయి. ఇప్పటికీ.. ఏ పార్టీ కూడా తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. సిరిపిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ మాత్రం.. ఈసారి ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కదంటోంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కేటీఆర్.
సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రిగా ఉన్న కేటీఆర్ నాలుగుసార్లు ఘన విజయం సాదించారు. గత ఎన్నికల్లో ఆయన భారీగా తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మహేందర్ రెడ్డిపై 89,009 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. అయినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు కేటీఆర్‌కు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత కొద్దికాలానికి కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. తండ్రి కేసీఆర్ ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించగా, కేటీఆర్ ఐదోవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఉవ్విళ్ళురుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల మంచీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈసారి ఒక లెక్క అన్నట్లు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూనే.. సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాన్ని వేగంగా అభివృద్ధి చేశారు. ఎంత బిజీ ఉన్నా వారంలో ఒక్కసారి, ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటించే విధంగా ప్లాన్ చేసుకున్నారు కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చిసా సిద్ధమే అన్నట్లు.. పెండింగ్ పనులు పూర్తి చేసుకున్నారు.
2018 ఎన్నికల్లో 89 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అయితే.. ఈసారి లక్షకు పైగా మెజారిటీ సాధిస్తామనే ధీమాతో ఉన్నారు కేటీఆర్. అయితే.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం.. భారతీయ జనతాపార్టీ బలపడింది. బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో కేవలం రెండు వేలకు పైగా మెజారిటీని సాధించింది బీఆర్ఎస్. గత ఎన్నికలతో పోలిస్తే బీజే బలం బాగా పుంజుకుంది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటోంది కాషాయపార్టీ. అందుకే కీలక నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వ్యూహం మార్చింది. అక్కడి గెలుపోటములను ప్రభావితం చేసే వర్గంపై గురిపెట్టింది. చేనేత సామాజికవర్గ నేతను బరిలోకి దించాలనుకుంటోంది. అయినప్పటికీ కేటీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం అంతంత మాత్రమే. మరోవైపు ఇప్పటివరకు ప్రతిపక్షాలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.. కాంగ్రెస్ నుంచీ కేకే మహేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈయన నియోజకవర్గానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదే కాంగ్రెస్ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. బీజేపీకి కూడా బలమైన అభ్యర్థి లేరు.. పద్మశాలి వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్‌ను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ ఈ నియోజకవర్గంలో, ఏ మాత్రం ప్రభావం చూపుతారనే అనుమానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష పార్టీలు అనుకున్న స్థాయిలో పుంజుకోకపోవడం.. కేటీఆర్‌కు ప్లస్ పాయింట్ మారింది..
గత నియోజకవర్గాలతో పోలిస్తే సిరిసిల్ల వేగంగా అభివృద్ధి చెందింది. అయితే సెకండ్ క్యాడర్ లీడర్ల వ్యవహారం కాస్తా ఇబ్బందిగా మారింది. సెకండ్ క్యాడర్ లీడర్స్ కారణంగా కార్యకర్తలకు.. కేటీఆర్‌కు మద్య గ్యాప్ ఏర్పడింది. ఇది కేటీఆర్‌కు మైనస్. ఇదిలావుంటే సిరిసిల్ల నియోజకవర్గంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా కేటీఆర్‌కు చెక్ పెడతామంటున్నారు. ఇక మారిన రాజకీయ పరిణామాలతో సిరిసిల్ల కేటీఆర్‌కు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక్కడ ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా రావని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి.. సిరిసిల్లలో ఆసక్తికరమైన పోరు కనపడుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




