Telangana: ఓటుకు రెడీ అంటున్న వందేళ్ల బామ్మ.. ఎన్నికలపై ఆమె ఏం చెబుతున్నారో తెలుసా..?

| Edited By: Jyothi Gadda

Nov 17, 2023 | 11:25 AM

వయసు 104 సంవత్సరాలు. ఈ నెల 30 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతుంది. 1957 నుండి ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నానని తెలిపింది ఆ వృద్దురాలు. ప్రాణమున్నంత వరకు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది ఈ బామ్మ. గత 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఈమె వీల్ చైర్‌లో కూర్చుని వెళ్లి మరీ ఓటు వేసింది. కాగా.. ప్రస్తుతం ఆ బామ్మకు ఆరోగ్యం సహకరించకపోవడతో

Telangana: ఓటుకు రెడీ అంటున్న వందేళ్ల బామ్మ.. ఎన్నికలపై ఆమె ఏం చెబుతున్నారో తెలుసా..?
Follow us on

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సేవ చేసే మంచి నాయకుడిని ఎన్నుకునే వజ్రాయుధం ఒకే ఒక్కటి ఓటు హక్కు. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వందేళ్ల పైబడిన బామ్మ రెడీ అయింది. ఆరూనూరైనా నూరు నూటాయాబై పైబడినా.. ఓటు హక్కు వినియోగించుకుని తీరుతానంటోంది. ఒక్క ఓటుతో నేతల తలరాతను మార్చ వచ్చని.. నిర్లక్ష్యం వీడండంటూ పిలుపునిస్తోంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన చివాటే అన్నపూర్ణబాయి..వయసు 104 సంవత్సరాలు. ఈ నెల 30 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతుంది. 1957 నుండి ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నానని తెలిపింది ఆ వృద్దురాలు. ప్రాణమున్నంత వరకు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది ఈ బామ్మ.

గత 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఈమె వీల్ చైర్‌లో కూర్చుని వెళ్లి మరీ ఓటు వేసింది. కాగా.. ప్రస్తుతం ఆ బామ్మకు ఆరోగ్యం సహకరించకపోవడతో 12(డి) ఫామ్ అప్లై చేసుకుంది. ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..