Telangana Election: సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ పైనే అందరి దృష్టి.. దామోదర్ రెడ్డికి టికెట్ దక్కేనా..?

ఆ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌పై అందరి దృష్టి పడిందా..? ఎందుకు ఆ సీనియర్ నేత పేరును హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది..? అదే నిజమనిపిస్తున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. సీనియర్ నేతకు సైతం టికెట్ తిప్పలు తప్పడం లేదు. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి లాయల్‌గా ఉన్నవారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అనుచరగణం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

Telangana Election: సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ పైనే అందరి దృష్టి.. దామోదర్ రెడ్డికి టికెట్ దక్కేనా..?
Ramreddy Damodar Reddy Patel Ramesh
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Oct 31, 2023 | 4:14 PM

ఆ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌పై అందరి దృష్టి పడిందా..? ఎందుకు ఆ సీనియర్ నేత పేరును హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది..? అదే నిజమనిపిస్తున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. సీనియర్ నేతకు సైతం టికెట్ తిప్పలు తప్పడం లేదు. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి లాయల్‌గా ఉన్నవారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అనుచరగణం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఏకంగా హై కమాండ్‌కే వార్నింగ్ ఇస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతుండగా, తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్‌లో పెట్టిన మూడు స్థానాల పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సూర్యాపేట ఒకటి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి సూర్యాపేట సీటు కోసం పట్టుబట్టారు. దీంతో అధిష్టానం ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టింది.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మూడున్నర దశాబ్దాలకుపైగా ఎమ్మెల్యేగా, మంత్రిగానూ పని చేశారు. ప్రస్తుతం టీపీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఏఐసీసీలోనూ కో అప్షన్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నారు.

గతంలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దామోదర్ రెడ్డికి ఆ రెండు నియోజకవ ర్గాలను ప్రభావితం చేసే సత్తా ఉంది. కాంగ్రెస్ వాదుల్లో దామోదర్ రెడ్డి కూడా ప్రధానమైన వ్యక్తి. 71 ఏళ్ల వయసు కలిగిన ఆయన, ఇదే తనకు చివరి ఎన్నిక అని, ఫైనల్ చాన్స్ ఇవ్వాలని హైకమాండ్ ను కోరుతున్నారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా ఉన్న దామోదర్ రెడ్డి ఇప్పటి దాక పార్టీ లైన్ దాటలేదనే పేరు ఉంది. 38 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్మకున్న ఆయన ఈ వయసులో టికెట్ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తుంగతుర్తిలో నాలుగుసార్లు, సూర్యాపేటలో ఒకసారి ఎమ్మె ల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి తొలిసారిగా 1991లో నేదురమల్లి జనార్ధన్ రెడ్డి కేబినెట్ లో ఒకసారి, 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో మరోసారి మంత్రిగా పనిచేశారు. 1994లో మాత్రం పార్టీ టికెట్ ఇవ్వకపోడంతో దామోదర్ రెడ్డి ఒక్కడే తుంగతుర్తి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.

అయితే ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహారించిన పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రెడ్డి విషయంలో ఏవిధంగా వ్యవహారిస్తారన్నది చర్చనీయాంశమైంది. సీనియర్ నేత జానారెడ్డి సపోర్టు ఉన్న దామోదర్ రెడ్డికి మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ ఇచ్చారు. అయితే కొంతకాలంగా పీసీసీ రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఇచ్చిన సిఫార్సు లేఖ సంచలనంగా మారింది.

సూర్యాపేట టికెట్ కోసం దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డిలు పోటీ పడుతుండడంతో పార్టీ హై కమాండ్ పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావితం చూపుతోందని కేడర్ ఆందోళన చెందుతుంది. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా లాయల్ గా పనిచేస్తున్న దామోదర్ రెడ్డి టికెట్ విషయంలో హై కమాండ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డిని ఢీకొట్టే సత్తా దామోదర్ రెడ్డికి మాత్రమే ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నేతలు ఐక్యంగా ఉంటే సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సూర్యాపేట టికెట్ కోసం దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డిలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి టికెట్ ఎవరికి వస్తుందో తెలియాలంటే మరో మూడు నాలుగు రోజులు వరకు వేచి చూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?