TS Eamcet 2023: మరో రెండు రోజుల్లో ముగియనున్న తెలంగాణ ఎంసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ
తెలంగాణ ఎంసెట్-2023కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసింది. రూ.5 వేల ఆలస్య రుసుంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాగా ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే..
తెలంగాణ ఎంసెట్-2023కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసింది. రూ.5 వేల ఆలస్య రుసుంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాగా ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు అదనంగా చెల్లించి మరీ దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.5 వేలతో ఇప్పటివరకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 8,394ల దరఖాస్తులు ఆలస్య రుసుంతో అందినట్లు ఎంసెట్ కో కన్వినర్ ఆచార్య విజయకుమార్‌రెడ్డి తెలిపారు.
ఏప్రిల్ 28న వరకు మొత్తం 3,19,947 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వారిలో ఇంజినీరింగ్‌కు 1,53,676ల దరఖాస్తు అందగా.. వాటిలో 1.08 లక్షల మంది హైదరాబాద్‌లోనే పరీక్ష రాయనున్నారు. అగ్రికల్చర్‌లోనూ 94,470ల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 63,730 మంది నగరంలోనే హాజరవనున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు పరీక్షలూ 372 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సారి ఎంసెట్‌కు దరఖాస్తులు భారీగా అందడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 130 వరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.