Telangana Corona Cases Update: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..
Telangana Corona Updates: కరోనా మహమ్మారి తగ్గిందనుకుని ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్..
Telangana Corona Updates: కరోనా మహమ్మారి తగ్గిందనుకుని ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దాంతో కరోనా బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 278 మంది కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,02,047 లకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజు 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే.. కరోనాను జయించిన వారి సంఖ్య 2,98,120 కి చేరింది.
ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృత్యువాత పడగా.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1662 లకు చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం ఉంది. ఇదే సమయంలో రికవరీ రేట్ 98.69 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,265 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 830 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 35 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత ఆదిలాబాద్‌లో – 28, నిర్మల్ – 24, మేడ్చల్ మల్కాజిగిరి – 21, రంగారెడ్డి – 12, కరీంనగర్ – 10, మంచిర్యాల – 10, సంగారెడ్డి – 10 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
Also read:
కోటి ఎకరాల మాగాణం దిశగా తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో మారిన దశ.. రికార్డు స్థాయిలో వరిసాగు