Telangana Formation Day: గాంధీభవన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా మీరా కుమార్..

రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనని చెపుతున్న కాంగ్రెస్‌.. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర పదో ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీపీసీసీ వినూత్న పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సోనియా గాంధీ ఫొటోకు పాలాభిషేకం చేయాలని డిసైడ్‌ అయ్యారు హస్తం నేతలు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా..

Telangana Formation Day: గాంధీభవన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా మీరా కుమార్..
Gandhi Bhavan

Updated on: Jun 02, 2023 | 6:16 AM

రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనని చెపుతున్న కాంగ్రెస్‌.. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర పదో ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీపీసీసీ వినూత్న పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సోనియా గాంధీ ఫొటోకు పాలాభిషేకం చేయాలని డిసైడ్‌ అయ్యారు హస్తం నేతలు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు మమ్మల్నే ఆదరిస్తారని దీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాధకురాలు సోనియా గాంధీయేనని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చిత్రపాటానికి పాలాభిషేకం చేయడానికి రెడీ అయ్యారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో వేడుకలను ప్లాన్‌ చేసింది కాంగ్రెస్. ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన మీరా కుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువరు మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు.

ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర అబిడ్స్ నెహ్రూ విగ్రహం మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుంది. అనంతరం గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులను సన్మానిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..