Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రపై ఇవాళ క్లారిటీ.. షెడ్యూల్ విడుదల చేసే అవకాశం..
రేవంత్ రెడ్డి పాదయాత్రపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సేవ్ కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే నేతలు ఈ యాత్రకు హాజరవుతారా.. లేదా?అన్నదే ఇప్పుడు ప్రశ్న..

రేవంత్ రెడ్డి పాదయాత్ర.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారిన అంశం. ఈ యాత్రపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సేవ్ కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే నేతలు ఈ యాత్రకు హాజరవుతారా.. లేదా? రాహుల్ పాదయాత్రకు కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో పేరుతో యాత్ర చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై టీపీసీసీ కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనుంది. ఏఐసీసీ నుంచి కీలక నేత హాజరుకాబోతున్నారు. రేవంత్ రెడ్డి యాత్రతో పాటు సోషల్ మీడియా, ఎన్నికల కమిషన్, ధరణి పోర్టల్ సహా పలు అంశాలపై చర్చ జరగనుంది.
ఈ నెల 26 న భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఎలాంటి సమాచారం లేదని.. అంతే కాకుండా ఇవాళ జరిగే మీటింగ్‌కు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదే క్రమంలో పీసీసీ పదవుల మధ్య ఈ మధ్య కాలంలో పెద్ద లొల్లి నడిచంది. దిగ్విజయ్ సింగ్ వచ్చి.. నేతల అభిప్రాయాలైతే తీసుకున్నారు.. కానీ దానికి సంబంధించి పార్టీలో ఎలాంటి నిర్ణయాలు మార్పులు జరగలేదు. ఇలాంటి టైమ్‌లో పీసీసీతో కలిసి నడిచేదెవరు? పట్టించుకోకుండా పక్కకు పోయేవారో?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
