Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్.. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే..

తెలంగాణ రాజకీయాల్లో వచ్చే నెల కీలకంగా మారనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పడి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే పలువురు పేర్లను పరిశీలిస్తున్నారు. అలాగే డిసెంబర్‌ 9వ తేదీ నంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి...

Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్.. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే..
Telangana
Follow us
Prabhakar M

| Edited By: Narender Vaitla

Updated on: Nov 22, 2024 | 12:26 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండటంతో దానికంటే ముందే ముహూర్తం ఫిక్స్ కానుంది. ఆ తర్వతా అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు, కుల గణన సర్వే, మరియు ఆర్ ఓ ఆర్ చట్టంపై చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక అంశాలను ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

డిసెంబర్ 7తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పదవీకాలంలో ఏడాది పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ప్రక్రియ వేగం పుంజుకోనుందని తెలుస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం, విస్తరణను మరింత కీలకంగా మారుస్తోంది.

ఈ మంత్రివర్గ విస్తరణలో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకు అధిక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక బెర్త్ కచ్చితంగా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. విస్తరణలో తోడుగా కొన్ని శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం 6 మంత్రివర్గ స్థానాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్; నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు; మహబూబ్ నగర్ మక్తల్ నుండి వాకిటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ కోటాలో బాలునాయక్, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన ఆశావహులుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆసరా పెన్షన్, రైతు భరోసా వంటి పథకాల అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పథకాలు ప్రజల్లో ప్రభుత్వం పై నమ్మకాన్ని పెంచేందుకు దోహదపడతాయని భావిస్తోంది. ఇదిలా ఉంటే కొండపోచమ్మ సాగర్ సమీపంలోని హరీష్ రావు ఫాం హౌస్ పై విచారణను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ చర్యతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. ఇవన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి . డిసెంబర్ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణపై అందరి పోకస్ ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్.. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే
తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్.. పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే
జార్జి రెడ్డి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కాల్సిందే..
జార్జి రెడ్డి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కాల్సిందే..
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
తండ్రి శవాన్ని కాల్చిన బూడిదపై గంజాయి మొక్క పెంచి.. సిగరెట్లుగా
తండ్రి శవాన్ని కాల్చిన బూడిదపై గంజాయి మొక్క పెంచి.. సిగరెట్లుగా
లాస్ట్ మినిట్‌లో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్..
లాస్ట్ మినిట్‌లో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్..
అదానీ గ్రూప్‌తో విద్యుత్‌ ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ
అదానీ గ్రూప్‌తో విద్యుత్‌ ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా..
కేకేఆర్ వద్దంది.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో మ్యాచ్ క్లోజ్ చేశాడు
కేకేఆర్ వద్దంది.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో మ్యాచ్ క్లోజ్ చేశాడు
గోల్డెన్ లగ్జరీ రైలు.. ఇందులో 7 స్టార్ హోటల్ తరహాలో సదుపాయాలు!
గోల్డెన్ లగ్జరీ రైలు.. ఇందులో 7 స్టార్ హోటల్ తరహాలో సదుపాయాలు!
దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే
దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?