CM KCR Review: తెలంగాణ వర్సెస్ సెంటర్ వయా ఏపీ.. విద్యుత్ శాఖ బకాయిలపై సీఎం కేసీఆర్ రివ్యూ..
Electricity Pending Bills: ఏపీ నుంచి రావాల్సిన బిల్లులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆదేశాలపై ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై..
విద్యుత్ శాఖ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర ఇచ్చిన ఆదేశాలు, ఏపీ నుంచి రావాల్సిన బిల్లులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆదేశాలపై ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కేంద్రానికి లేఖ రాయాలా? ఏం చేయాలి? అనేదానిపై సీఎం కేసీఆర్ రివ్యూ చేస్తున్నారు. ఈ సమీక్ష తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరెంట్ బకాయిల వివాదం ఇప్పుడు రాజుకుంటోంది. తెలంగాణ వర్సెస్ సెంటర్ వయా ఏపీగా మారుతోంది. ఏపీ జెన్‌కోకు బకాయిలు వడ్డీతో కలిపి చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేంద్రం విద్యుత్ శాఖ ఆదేశించింది. 6756 కోట్లు నెలరోజుల్లో చెల్లించాలని కండీషన్ పెట్టింది.
రూ. 3 వేల 441 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు రూ. 3 వేల 315 కోట్ల లేట్ పేమెంట్ కూడా చెల్లించాలని ఆదేశించింది. విభజన తర్వాత 2014 నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వం అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించింది. ఇటీవల ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. దీంతో వెంటనే ఇప్పుడు కేంద్రం విద్యుత్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. విభజన చట్టం రూల్స్ ప్రకారం కేంద్రం ఆదేశాలతో ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది.
2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసింది. ఏపీ సరఫరా చేసిన విద్యుత్ 3441 కోట్లు కట్టాలి. అయితే ఏపీ జెన్‌కో ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కేసు వేసింది. అక్కడా వివాదం పరిష్కారం కాకపోవడంతో హైకోర్టులో కేసు వేసింది. ఇప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
అయితే తెలంగాణ వాదన మరోలా ఉంది. కేంద్రం 6756 కోట్లు కట్టాలని ఆదేశాలు జారీ చేయడంపై మండిపడింది. విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ సెంట్రల్ పవర్ సిస్టమ్ పరిధిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా డెవలఫ్‌మెంట్ కోసం విద్యుత్ సంస్థలు 12941 కోట్ల రుణాలు తీసుకున్నాయని తెలంగాణ చెబుతోంది. ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవి ఎక్కువేనని..ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు బకాయిలు చెల్లించేది లేదని అంటోంది.
30 రోజుల్లో బకాయిలు చెల్లించాలని కేంద్రం చెబితే… ఆదేశాలు ఏకపక్షమని తెలంగాణ మండిపడింది. విభజన వివాదాలతో ఈ బకాయిలు ముడిపెట్టొద్దని కేంద్రం సూచిస్తే…. విభజన చట్టం అమలులో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని తెలంగాణ ప్రశ్నించింది.
విభజన చట్టం 92 ప్రకారం బకాయిలు చెల్లించాలని… చట్ట ప్రకారమే ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని కేంద్ర విద్యుత్ శాఖ చెబితే.. ఈ చర్యలు కక్షపూరితంగా ఉన్నాయని తెలంగాణ సర్కార్ మండిపడింది. ప్రధానితో ఏపీ సీఎం జగన్ భేటీ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేస్తే…. తెలంగాణ లేఖలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడని ఇక్కడి మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ తెలంగాణపై చిన్న చూపే కదా? అంటున్నారు. కేంద్రం ఆదేశాలు కచ్చితంగా దేశద్రోహ చర్యే అన్నారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణను చీకట్లోకి నెట్టాలని కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీ నుంచే తమకు 12 వేల 941 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.
కేంద్ర విద్యుత్‌శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. 3 వేల 441 కోట్ల రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్‌తో పాటు 3 వేల 315 కోట్ల లేట్ పేమెంట్ కూడా చెల్లించాలని ఆదేశించింది. విభజన తర్వాత 2014 నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసిన బిల్లుల్ని అడుగుతోంది ఏపీ. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్షకట్టిందని విమర్శించారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఏపీ నుంచి తెలంగాణకు 12వేల 900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మంత్రి అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏపీకి తెలంగాణ డిస్కంల విద్యుత్ బకాయిల పేరుతో ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.
మరిన్న తెలంగాణ వార్తల కోసం