AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దేశం దారి తప్పుతోంది.. దేశ రాజకీయాలపై మరోసారి సంచలన కామెంట్స్‌ చేసిన సీఎం కేసీఆర్‌

CM KCR: దేశ రాజకీయాలపై మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు సీఎం కేసీఆర్‌. దేశం దారి తప్పుతోందన్నారు. దుర్మార్గమైన పనులు దేశంలో జరుగుతున్నాయని విరుచుకుపడ్డారు..

CM KCR: దేశం దారి తప్పుతోంది.. దేశ రాజకీయాలపై మరోసారి సంచలన కామెంట్స్‌ చేసిన సీఎం కేసీఆర్‌
Subhash Goud
|

Updated on: Feb 23, 2022 | 3:36 PM

Share

CM KCR: దేశ రాజకీయాలపై మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు సీఎం కేసీఆర్‌. దేశం దారి తప్పుతోందన్నారు. దుర్మార్గమైన పనులు దేశంలో జరుగుతున్నాయని విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్ (CM KCR). బుధవారం మల్లన్నసాగర్‌ (Mallanna Sagar )ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించారు. కర్నాటకలో మతకల్లోలాలు రేపారని ఆరోపించారు. ఆడపిల్లలు అక్కడ చదవాలంటేనే భయపడుతున్నారని.. దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మతకల్లోలాలు జరిగితే ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు పెడతారా? అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు దేశానికి మంచిది కాదని.. ఆ క్యాన్సర్‌ని విస్తరించరాదంటే.. ఎక్కడికక్కడ నరికి నలిపేయాలన్నారు సీఎం. జాతీయ రాజకీయాలు ప్రభావితం జరిగేలా మందుకెళ్తున్నానని, హైదరాబాద్‌ ఐటీ పెరుగతోందని పేర్కొన్నారు.

మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, మన కలలు కన్న తెలంగాణ రాష్ట్రంలో పాటు స‌స్యశ్యామ‌ల తెలంగాణ‌ను చూస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ‌బ‌డ్డ అతి భారీ జ‌లాశ‌యం మల్లన్న సాగ‌ర్‌ను ప్రారంభించుకోవ‌డం హ‌ర్షించుకోద‌గ్గ ఘ‌ట్టమన్నారు.

గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగబోతున్నామని, గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నామన్నారు. అయితే సింగూరు ప్రాజెక్టును త‌ల‌ద‌న్నేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, సిద్దిపేట‌కే కాకుండా హైద‌రాబాద్ న‌గ‌రానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు మల్లన్నసాగరని సీఎం అన్నారు. ప్రాజెక్టు కోసం 58వేల మంది కార్మికులు పని చేశారని, ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్‌. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మల్లన్న సాగర్‌ నిర్మాణం జరిగిందని, 9 జిల్లాల వరప్రదాయినిగా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ అని, నూతన తెలంగాణ నిర్మించుకున్న అతిపెద్ద ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ అని కేసీఆర్‌ వెల్లడించారు. అయితే నిర్మాణం జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు పనులను ఆపాలని కొందరు కోర్టుకు వెళ్లారని, ప్రాజెక్టును ఆపే కుట్రలో భాగంగా వందలాది కేసులు వేశారని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్లామన్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ నియోజకవర్గం కోసం కాంగ్రెస్ నేతల పోటాపోటీ.. టికెట్‌పై అప్పుడే మొదలైన నేతల కుమ్ములాట

Telangana: తెరమీదకు మరో కీలక అంశం.. ఉద్యమానికి గులాబీ నేతల శ్రీకారం

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు