Telangana: తెరమీదకు మరో కీలక అంశం.. ఉద్యమానికి గులాబీ నేతల శ్రీకారం

Bayyaram steel plant: విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు.. ఇది చరిత్ర.. నడుస్తున్న నినాదం.. ఉద్యమం కూడా. ఇప్పుడు, తెలంగాణలోనూ ఇలాంటి ఉద్యమమే పురుడు పోసుకుంది.

Telangana: తెరమీదకు మరో కీలక అంశం.. ఉద్యమానికి గులాబీ నేతల శ్రీకారం
Trs
Shaik Madarsaheb

|

Feb 23, 2022 | 2:23 PM

Bayyaram steel plant: విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు.. ఇది చరిత్ర.. నడుస్తున్న నినాదం.. ఉద్యమం కూడా. ఇప్పుడు, తెలంగాణలోనూ ఇలాంటి ఉద్యమమే పురుడు పోసుకుంది. అదే బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు. ఈ హక్కు ఇచ్చింది కూడా చట్టమే. అవును, 2014 ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-13వ షెడ్యూల్‌-సెక్షన్‌ 93 ఆ హక్కు కల్పి్ంచింది. ఆ హక్కుతోనే ఇప్పుడు కొత్త స్లోగన్ ఎత్తుకుంది టీఆర్‌ఎస్‌. అయితే, ఇప్పుడే ఎందుకు బయ్యారం తెరపైకి వచ్చింది?. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు స్లోగన్‌ను టీఆర్ఎస్‌ భుజాలపైకెత్తుకోవడానికి కారణమేంటి? టీఆర్‌ఎస్‌, బీజేపీ.. (TRS Vs BJP) ఈ రెండు పార్టీల మధ్య ఉప్పునిప్పు కాన్సెప్ట్‌ గరంగరంగా నడుస్తోంది. ఒక్కో ఇష్యూను బయటికి తీస్తూ ఒకరిపై మరొకరు ఎటాక్స్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే, ఇప్పుడు బయ్యారం ఉక్కు (Bayyaram steel plant) పొలిటికల్‌గా హీట్ పెంచుతోంది.

ఎవరిది ఉక్కు సంకల్పమో? ఎవరిది తుక్కు సంకల్పమో? తేల్చుకునే సమయం వచ్చిందంటూ ఉక్కు సైరన్ మోగించింది గులాబీ దళం. హక్కుగా రావాల్సిన మా ఉక్కును ఇంకెన్నాళ్లు తొక్కిపెడతారంటూ కేంద్రంపై విరుచుకుపడుతోంది. పనిలో పనిగా తెలంగాణ బీజేపీని టార్గెట్ చేసింది టీఆర్‌ఎస్‌. బయ్యారం ఉక్కుపై కేంద్రం తీరును ఎండగడుతూ లేఖ రాశారు కేటీఆర్. బయ్యారం ఉక్కులో నాణ్యత లేదనే సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశ ఖనిజ నిల్వల్లో 11శాతం, అంటే సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్‌ ఓర్‌ ఉందన్నారు కేటీఆర్.

కేంద్ర ఉక్కు మంత్రికి కేటీఆర్‌ రాసిన ఈ లేఖే ఇప్పుడు మంటలు రాజేస్తోంది. కేటీఆర్‌ లెటర్‌పై బీజేపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయ్. అదే టైమ్‌లో, కమలానికి దీటుగా స్ట్రాంగ్‌ కౌంటరిస్తోంది గులాబీ దళం. అయితే.. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఫీజుబులిటీ కాదంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ప్రైవేట్‌ సెక్టార్‌లో తక్కువ ధరకు స్టీల్‌ దొరుకుతుంటే, అధిక వ్యయంతో ఉత్పత్తిచేసి అమ్మడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అదేం, కుదరదు, బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు, ప్లాంట్‌ నిర్మించి తీరాల్సిందేనంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు.

తెలంగాణ బిడ్డై ఉండి, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదంటారా అంటూ కిషన్‌రెడ్డిపై ఫైర్ అవుతున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. కేంద్రానికి ఇదే మాటైతే, బీజేపీని గిరిజనులే తిరిమికొడతారన్నారు ఖమ్మం జిల్లా గులాబీ నేతలు. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కంటోంది టీఆర్‌ఎస్. తమదికి రాజ్యాంగబద్ధంగా దక్కిందని చెబుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, టచ్ చేసి చూడు ఎపిసోడ్‌కు బయ్యారం ఉక్కు నినాదం యాడ్ అవడంతో పొలిటికల్‌గా హీట్ మరింత పెరిగింది. కిషన్‌రెడ్డి కామెంట్స్‌కు నిరసనగా ఈ రోజు ఒక్కరోజు దీక్షకు దిగింది టీఆర్ఎస్.

Also Read:

Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి చంపిన దుర్మార్గుడు..

ట్యూషన్ కు వచ్చిన బాలికపై కన్నేశాడు.. ప్రతిఘటించడంతో గొంతు నులిమి మట్టుబెట్టాడు.. చివరకు

Viral News: ట్రెండీ లుక్‌లో తళుక్కుమన్న మెరుపు తీగ రీనా ద్వివేది.. కొంచెం మార్పు అవసరమంటూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu