AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి చంపిన దుర్మార్గుడు..

Grishma murder case: ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలి. కన్న తల్లి ముందే యువతి గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ సైకో లవర్‌. తన కళ్ల ముందే కడుపున పుట్టిన బిడ్డను.. ఓ ప్రేమోన్మాది

Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి చంపిన దుర్మార్గుడు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Feb 23, 2022 | 2:02 PM

Share

Grishma murder case: ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలి. కన్న తల్లి ముందే యువతి గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ సైకో లవర్‌. తన కళ్ల ముందే కడుపున పుట్టిన బిడ్డను.. ఓ ప్రేమోన్మాది చంపుతుంటే ఆ దారుణాన్ని చూసిన తల్లి బాధ మాటల్లో చెప్పలేం. పట్టపగలు అందరిముందు జరిగిన ఈ దారుణ ఘటన గుజరాత్‌ (Gujarat) లో ఈ నెల 12న జరిగింది. గ్రీష్మా వెకారియా (21) (Grishma murder) హత్య.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతోపాటు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. పట్టపగలు.. నడిరోడ్డు.. అందరూ చూస్తుండగానే గ్రీష్మ గొంతుకోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు కిరాతకుడు ఫెనిల్‌ గొయాని. తన ప్రేమను నిరాకరించిందని తన రాక్షసత్వం ప్రదర్శించాడు. యువతి తల్లి, కుటుంబసభ్యులు వద్దు వద్దంటూ ఎంత వేడుకున్నా.. ఆ కిరాతకుడు చెవికెక్కించుకోలేదు. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే దుర్మార్గుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ముందు యువతి పెద్దనాన్న కాపాడేందుకు వెళ్లగా అతన్ని కడుపులో పొడిచాడు. ఆ తర్వాత ఆమె తమ్ముడి చేతిపై కూడా గాయం చేశాడు. దీంతో అందరూ భయపడి దుర్మార్గుడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

ఎవరైనా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఆ బంగారు తల్లి బతికి ఉండేదని.. ఆ కన్నతల్లికి కడుపు కోత ఉండేది కాదంటూ పలువురు పేర్కొంటున్నారు. ఆడపిల్లగా పుట్టిన పాపానికి ఆమె జీవితం అర్థాంతరంగా ప్రేమోన్మాదానికి బలైపోయింది. యువతి గొంతు కోసి కూడా కిరాతకుడు అక్కడే నిలబడ్డాడు. ఆ తర్వాత సైకో జేబులోంచి గుట్కా తీసి తింటూ.. సుమారు 2-3 నిమిషాల పాటు.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతి వైపు చూశాడు. ఎవరైనా వస్తే చంపుతానంటూ బెదిరించడంతో.. అందరూ భయపడి ఎవరూ కూడా ఆ యువతిని బతికించేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమ పేరుతో వేధింపులు.. 

గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన 21 ఏళ్ల గ్రిష్మా వెకారియా ఓ కళాశాలలో బీకామ్ చదువుతోంది. ఈ క్రమంలో గతేడాది నుంచి ఫెనిల్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ ఇబ్బంది పెడుతుండటంతో.. ఆమె ఇంట్లో చెప్పింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఫెనిల్ కుటుంబసభ్యులకు చెప్పారు. ఫెలిన్‌‌ను అతని తండ్రి అందరి ముందు మందలించాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ గ్రీష్మ వెంట పడిన నిందితుడు సరిగ్గా వాలెంటైన్స్ డేకు రెండు రోజుల ముందు ఆమెను కిరాతకంగా చంపాడు.

ఉరి తీయండి: నిందితుడి తండ్రి

ఈ క్రూరత్వానికి సంబంధించి నిందితుడు ఫెనిల్ తండ్రి పంకజ్ గోయాని వాంగ్మూలం ఇచ్చారు. ఫెనిల్ తమ కుటుంబానికి సమస్యగా మారాడని.. ఇలాంటి పనిచేసినందుకు ఉరి తీయడమే మేలని పేర్కొన్నాడు. కోర్టు మరణశిక్ష విధించినా.. తాము చింతించమంటూ పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై సూరత్ పోలీసులు 2,500 పేజీల చార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. అందరూ ఈ ఘటనపై స్పందిస్తూ.. త్వరగా ఈ కేసును విచారించి నిందితుడు ఫెనిల్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

ట్యూషన్ కు వచ్చిన బాలికపై కన్నేశాడు.. ప్రతిఘటించడంతో గొంతు నులిమి మట్టుబెట్టాడు.. చివరకు

Viral News: ట్రెండీ లుక్‌లో తళుక్కుమన్న మెరుపు తీగ రీనా ద్వివేది.. కొంచెం మార్పు అవసరమంటూ..