ప్రియుడిని చితక బాదిన యువతి.. కారణం తెలిస్తే శెభాష్ అనాల్సిందే..

ప్రేమించి(Love) మోసం చేశాడని సూసైడ్‌(suicide) చేసుకున్న ఘటనలు చూశాం. ప్రియుడి ఇంటి ఎదుట కూర్చుని న్యాయం కోసం నిరసనలు చేసే ఘటనలూ చూశాం. పెద్ద మనుషుల

ప్రియుడిని చితక బాదిన యువతి.. కారణం తెలిస్తే శెభాష్ అనాల్సిందే..
Attack
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 23, 2022 | 1:23 PM

ప్రేమించి(Love) మోసం చేశాడని సూసైడ్‌(suicide) చేసుకున్న ఘటనలు చూశాం. ప్రియుడి ఇంటి ఎదుట కూర్చుని న్యాయం కోసం నిరసనలు చేసే ఘటనలూ చూశాం. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి తాడో పేడో తేల్చుకునే వారినీ చూశాం. కానీ, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరని రుజువు చేసింది ఈ యువతి. ప్రేమించాడు. నువ్వే ప్రాణమన్నాడు. నీతోనే జీవితమన్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి భద్రకాళిలా మారింది. వివాహానికి నిరాకరించిన యువకుడికి సరైన రీతిలో బుద్ధి చెప్పింది. ప్రేమ పేరుతో మరొకరు మోసం చేయాలంటేనే వణుకు పుట్టేలా చేశావంటూ ఆ యువతిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు స్థానికులు.

కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెద్దకూటేరు గ్రామానికి చెందిన యువతి ,చిన్నకూటేరు గ్రామానికి చెందిన యువకుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. కొంత కాలంగా యువకుడి తీరుపై యువతి అనుమానం వ్యక్తం చేసింది. తనను పెళ్లి చేసేందుకు ప్రియుడు నిరాకరిస్తున్నాడని తెలుసుకుంది. ప్రేమ పేరుతో తనను మోసం చేస్తున్నాడని గ్రహించి, ఆగ్రహంతో రగిలిపోయింది. ఎలాగైనా సరే అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. విషయాన్ని తన బంధువులు చెప్పి, వారి సహాయంతో యువకుడిని తన ఊరికి రప్పించింది.

అనంతరం తనకు తాళి కడతావా..? లేదా..? అంటూ రోకలి బండతో కసితీరా కొట్టింది. మోసం చేసిన ప్రియుడిని యువతి కొడుతుంటే..అక్కడున్న వారందరూ తాళి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. ప్రేమ పేరుతో మోసం చేసే ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి జరగాల్సిందేనని అభిప్రాయ పడుతున్నారు.

Also Read

ఆన్ లైన్ ఆటలకు బానిసై.. చేసిన అప్పులు తీర్చలేక.. ఎవరూ లేని సమయంలో

Viral News: ట్రెండీ లుక్‌లో తళుక్కుమన్న మెరుపు తీగ రీనా ద్వివేది.. కొంచెం మార్పు అవసరమంటూ..

Mekapathi Goutham Reddy: ప్రారంభమైన గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర.. వీడియో