ఆన్ లైన్ ఆటలకు బానిసై.. చేసిన అప్పులు తీర్చలేక.. ఎవరూ లేని సమయంలో
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత(Technology) తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే దుష్ప్రభావాలూ ఉన్నాయి. సాంకేతికతకు అలవాటు పడి కొందరు విలువైన..
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత(Technology) తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే దుష్ప్రభావాలూ ఉన్నాయి. సాంకేతికతకు అలవాటు పడి కొందరు విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. శరీర శ్రమ ఉండే ఆటలు కాకుండా ఆన్ లైన్ ఆటల(Online games) కు అలవాడు పడుతున్నారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అందులో చిక్కుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆన్ లైన్ ఆటలకు అలవాటు పడి ఓ యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఆటల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన జితేంద్ర వసాకల్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్యాడ్యూయేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ ఆటల కోసం అప్పులు చేశాడు. అవి ఎక్కువవడం, అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇండోర్‌లోని ఇంద్రపురి హాస్టల్లో ఉండే జితేంద్ర వసాకల్.. ఎవరూ లేని సమయంలో గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భవర్ఖాన్ పోలీసులు తెలిపారు. జితేంద్ర జేబులోని ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కొన్ని ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు అప్పులు చేశానని, వాటిని తీర్చలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు.
Also Read
Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 307, నిఫ్టీ 95 పాయింట్ల ప్లస్..
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
ఉసురు తీసిన రోడ్డు ప్రమాదం.. మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరతామనగా.. కూలిన కలలు