Viral Video: యూపీలో ఆసక్తికర దృశ్యం.. ప్రియాంకా గాంధీతో BJP కార్యకర్తలు సెల్ఫీలు

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతోంది. ఈ సందర్భంగా హర్దాయ్‌లో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది.

Viral Video: యూపీలో ఆసక్తికర దృశ్యం.. ప్రియాంకా గాంధీతో BJP కార్యకర్తలు సెల్ఫీలు
Priyanka Gandhi Greets Bjp Workers
Follow us
Janardhan Veluru

|

Updated on: Feb 23, 2022 | 10:51 AM

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతోంది. ఈ సందర్భంగా హర్దాయ్‌లో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. యూపీ ఎన్నికల ప్రచారానికి కారులో వెళ్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.  ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా బీజేపీ కార్యకర్తలు అడిగి తీసుకున్నారు. ప్రియాంక గాంధీ స్వయంగా పార్టీ మేనిఫెస్టో కాపీలను బీజేపీ కార్యకర్తలకు పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూపీలో నాలుగో విడత పోలింగ్..

ఏడు విడతల్లో జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. 9 జిల్లాల్లో విస్తరించిన 59 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. ఈ దఫాలో 624 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు.  ఈ దఫాలో కీలకమైన లఖ్‌నవూ జిల్లాతో పాటు కాంగ్రెస్‌కు కంచుకోట రాయ్‌బరేలీ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో 2017లో బీజేపీ 51, ఎస్పీ 4, బీఎస్పీ 3, అప్నాదళ్(ఎస్)1 లో గెలుపొందాయి.

ప్రియాంక గాంధీని చుట్టుముట్టిన బీజేపీ కార్యకర్తలు.. వీడియో

Also Read..

హైదరాబాద్ లో అదృశ్యమైన చిన్నారి.. ఢిల్లీలో ప్రత్యక్షం.. చివరికి ఏం జరిగిందంటే

5G Smart Phones: 5జీ ఫోన్‌ కొనాలా !! ఇదిగో రూ. 20 వేల లోపు బెస్ట్‌ ఫోన్స్‌ మీకోసం.. వీడియో