NTPC jobs: గేట్ 2021 స్కోర్ ఆధారంగా.. ఎన్టీపీసీలో 40 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు!
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC).. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Engineering Executive Trainees Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
NTPC Engineering Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC).. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Engineering Executive Trainees Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET- 2021)
ఖాళీల వివరాలు: ఐటీ: 15 మైనింగ్: 25
అర్హతలు: బీఈ/బీటెక్‌లలో సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాడే వ్యాలిడ్ గేట్ 2021 ర్యాంక్ ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి 1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2021 మెరిట్ ర్యాంక్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: