Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో ఉద్యోగాల పేరుతో అపాయింట్‌మెంట్‌లు.. హెచ్చరించిన ఐటీ శాఖ.

Income Tax: నిరుద్యోగుల ఆశను తమకు పెట్టుబడిగా మార్చుకొని ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్ని రకాల మోసాలు బయటపడుతున్నా.. అక్రమార్కులు మాత్రం తగ్గడం లేదు. ఉద్యోగాల (Jobs) పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తూ..

Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో ఉద్యోగాల పేరుతో అపాయింట్‌మెంట్‌లు.. హెచ్చరించిన ఐటీ శాఖ.
Fake Job Alert
Follow us

|

Updated on: Feb 23, 2022 | 11:27 AM

Income Tax: నిరుద్యోగుల ఆశను తమకు పెట్టుబడిగా మార్చుకొని ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్ని రకాల మోసాలు బయటపడుతున్నా.. అక్రమార్కులు మాత్రం తగ్గడం లేదు. ఉద్యోగాల (Jobs) పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తూ.. నిండా ముంచుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల (Govt Jobs) పేరిట నిత్యం ఏదో ఒక చోట మోసం బయటపడుతూనే ఉంది. ఇదే విషయమై తాజాగా ఆదాయపన్ను శాఖ నిరుద్యోగ అభ్యర్థులను అలర్ట్‌ చేసింది. అక్రమ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ప్రకటనలను నమ్మవద్దంటూ ప్రకటన జారీ చేసింది. ఈ విషయమై ఉద్యోగ అభ్యర్థుల్లో అవగాహన కలిగించేందుకు ఐటీ శాఖ ఓ ట్వీట్ చేసింది.

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు ఎస్‌ఎస్‌సీ లేదా సంబంధిత శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే నమ్మాలని తెలిపారు. ఈ వెబ్‌సైట్స్‌లో వచ్చిన నోటిఫికేషన్స్‌కు మాత్రమే స్పందించాలంటూ పేర్కొన్నారు. కొంత మంది మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ లేఖల పేరుతో మోసాలకు పాల్పడుతోన్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గ్రూప్‌ బి, గ్రూప్‌ సి ఉద్యోగాలన్నింటినీ నేరుగా ఎస్‌ఎస్‌సీ ద్వారానే భర్తీ చేస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ వెబ్‌సైట్‌లలో ఉద్యోగ సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఉద్యోగాల పేరిట జరుగుతోన్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: kpac lalitha: ప్రముఖ నటి కన్నుమూత.. ఎమోషనల్‌ పోస్ట్ చేసిన కీర్తి సురేష్‌..

Technical Officer Jobs: బీఈ/బీటెక్‌ అర్హతతో హైదరాబాద్‌ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు.. నెలకు 63 వేల జీతం..

Viral Video: తగ్గేదేలే.. టీమిండియా ప్లేయర్ల సందడి మాములుగా లేదుగా.! ఈ క్రేజ్‌ ఏంటి ‘సామీ’..