DSEU Librarian Recruitment: ఐటీఐ/బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఢిల్లీ స్కిల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ (DSEU).. నాన్ అకడమిక్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

DSEU Librarian Recruitment: ఐటీఐ/బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఢిల్లీ స్కిల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
Dseu
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 23, 2022 | 11:29 AM

DSEU Non-Academic Recruitment 2022: ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ (DSEU).. నాన్ అకడమిక్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 43

పోస్టుల వివరాలు: జూనియర్‌ మెకానిక్‌, వర్క్‌షాప్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ మెకానిక్‌, జూనియర్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, లైబ్రేరియన్.

విభాగాలు: కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్‌.. ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.40,000ల నుంచి 1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గ్రూప్‌ ఏ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్‌ బీ, సీ పోస్టులను రాతపరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Tirupati: శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ ధరలు ఏకంగా 5 రెట్లు పెంపు!