Technical Officer Jobs: బీఈ/బీటెక్ అర్హతతో హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు.. నెలకు 63 వేల జీతం..
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC).. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల (Technical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
NFC Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC).. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల (Technical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.67,700లు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: స్ర్కీనింగ్ టెస్ట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Assistant Personnel Officer, Recruitment – I, Nuclear Fuel Complex, ECIL Post, Hyderabad – 500062.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీజీ అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: