Viral Video: తగ్గేదేలే.. టీమిండియా ప్లేయర్ల సందడి మాములుగా లేదుగా.! ఈ క్రేజ్‌ ఏంటి ‘సామీ’..

Viral Video: ఏమంటూ పుష్ప (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) 'తగ్గేదేలే' అన్న డైలాగ్‌ చెప్పాడో కానీ ఈ సినిమా క్రేజ్‌ మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. బహుశా ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో క్రేజ్‌ దక్కడం ఇదే తొలిసారి...

Viral Video: తగ్గేదేలే.. టీమిండియా ప్లేయర్ల సందడి మాములుగా లేదుగా.! ఈ క్రేజ్‌ ఏంటి 'సామీ'..
Viral Video Pushpa
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 23, 2022 | 9:03 AM

Viral Video: ఏమంటూ పుష్ప (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘తగ్గేదేలే’ అన్న డైలాగ్‌ చెప్పాడో కానీ ఈ సినిమా క్రేజ్‌ మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. బహుశా ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో క్రేజ్‌ దక్కడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్‌ నుంచి మొదలు కోలివుడ్ వరకు దేశమంతా పుష్ప మేనియా కొనసాగుతోంది. సినిమా విడుదలై నెలలు గడుస్తోన్నా ఇప్పటికీ పుష్ప ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలకు చేస్తున్న రీల్స్‌ నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప మాయలో పడిపోయారా అన్నట్లు కనిపిస్తోంది. చివరికి క్రికెటర్లకు కూడా పుష్ప ఫీవర్‌ అంటుకుంది. ఇతర దేశాల క్రికెటర్స్‌ కూడా పుష్ప పాటలకు, డైలాగ్‌లకు రీల్స్‌ చేస్తుండడం విశేషం. ఇలాంటి ఎన్నో వీడియోలు రోజూ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా టీమిండియా క్రికెట్లరకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా టీమిండియా ప్లేయర్‌ యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్‌ ముగిసిన అనంతరం తోటి క్రికెటర్స్‌తో కలిసి బస్సుల్లో ప్రయాణిస్తున్నాడు. ఇదే సమయంలో అతని పక్కన్న నవదీప్‌ సైని, హర్‌ప్రీత్‌ బ్రార్‌ కూర్చున్నారు. వీరు ముగ్గురు కలిసి పుష్పలోని ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌, తగ్గేదేలా’ అనే హిందీ డైలాగ్‌కు రీల్స్‌ చేశారు.

ఈ ముగ్గురు క్రికెట్లరకు డైలాగ్‌కు తగ్గట్లు పలికిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చాహల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం నెట్టింట సందడిగా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. మరి మన క్రికెటర్ల యాక్టింగ్‌ ట్యాలెంట్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Kajal Aggarwal: చీర క‌ట్టు అందాల‌తో రెచ్చ‌గొడుతున్న చందమామ బ్యూటీ

Vignesh Shivan: నా టైటానిక్‌లో ఇద్దరు రోజ్‌లు ఉన్నారు.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన దర్శకుడు విఘ్నేష్‌..

Vignesh Shivan: నా టైటానిక్‌లో ఇద్దరు రోజ్‌లు ఉన్నారు.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన దర్శకుడు విఘ్నేష్‌..

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!