Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. బ్రేక్‌ఫాస్ట్ మెనూ వచ్చేసింది.. ఇదిగో ఐటమ్స్ లిస్ట్!
తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రూపొందించిన ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని 2026–27 విద్యా సంవత్సరంలో కొత్త రూపంలో అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం టిఫిన్‌తో పాటు పాలు లేదా రాగి జావ అందించనున్నారు.

రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు విద్యావ్యస్థలో ఇప్పటికే అనేక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైమరీ నుంచి ఇంటర్ అన్ని ప్రభుత్వం పాఠశాలు, కాలేజీలలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవంత్సరం నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం. వారంలో ఆదివారం సెలవు ఉండటంతో మిగిలిన ఆరు రోజుల పాటు ఉదయం టిఫిన్ అందిస్తారు. అందులో రెండు రోజులు మిల్లెట్ ఇడ్లీ, మిగతా రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోసె, బోండా, పూరి వంటి వంటకాలను మెనూలో చేర్చారు. అలాగే అవసరాన్ని బట్టి సోమవారం దోసెకు బదులుగా చపాతీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మాకు బదులుగా పొంగల్ ఇవ్వడానికి కూడా వెసులుబాటు కల్పించారు.
రోజువారీ మెనూ ఇలా..
సోమవారం దోసె-చట్నీ లేదా చపాతీ-కర్రీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ-సాంబారు, బుధవారం పూరి-ఆలూ కుర్మా, గురువారం మిల్లెట్ ఇడ్లీ-సాంబారు, శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ, శనివారం బోండా-చట్నీ. టిఫిన్‌తో పాటు మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావ అందిస్తారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆహారం తీసుకునేందుకు ప్రతిరోజు 45 నిమిషాల సమయం కేటాయించనున్నారు.
ఈ పథకం అమలుకు ప్రభుత్వం మొత్తం రూ.720 కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది. ఇందులో పాఠశాల విద్యార్థుల టిఫిన్ కోసం రూ.540 కోట్లు, పాల సరఫరా కోసం రూ.180 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.56 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే ఈ నిధులను బడ్జెట్‌లో కూడా పొందుపరిచారు.
తమిళనాడులో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై పర్యటనలో ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత ఇప్పుడు దీనికి పూర్తి రూపురేఖలు సిద్ధమయ్యాయి. విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతం, చదువుపై దృష్టి పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
