AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHAI Summer Internship 2026: నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!

NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ పోగ్రామ్‌ను అందిస్తుంది. ఈ కింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

NHAI Summer Internship 2026: నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!
NHAI Summer Internship program
Srilakshmi C
|

Updated on: Mar 27, 2026 | 8:39 AM

Share

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026’ కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ పోగ్రామ్‌ను అందిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15, 2026వ తేదీ వరకు అధికారిక NHAI ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రోగ్రామ్‌ అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ ఇంటర్న్‌షిప్ 2026 మే 4 నుంచి జూలై 5 వరకు జరగనుంది. ఇందులో సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు విభాగాలతో పాటు, లా (BA LLB), కామర్స్, సైన్సెస్ (BA/BCom/BSc), మేనేజ్‌మెంట్ (HR, ఫైనాన్స్, మార్కెటింగ్‌లో MBA), మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్ వంటి నాన్-టెక్నికల్ విభాగాలు ఉంటాయి. ఎంపికైన ఇంటర్న్‌లు NHAI ప్రధాన కార్యాలయాలు, క్షేత్ర కార్యాలయాలలో అనుభవజ్ఞులైన నిపుణుల మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం కల్పిస్తారు. తద్వారా భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యవస్థపై ఆచరణాత్మక అనుభవాన్ని పొందొచ్చు. వీరికి స్టైపెండ్ కింద నెలకు రూ. 20,000 చొప్పున అందిస్తారు. అలాగే కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ కూడా అందిస్తారు.

ఇవి కూడా చదవండి

NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రోగ్రామ్‌ అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అర్హతలు ఏమేం ఉండాలంటే..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (NIRF) కింద అగ్రశ్రేణి సంస్థలు, ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు, మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థల్లో సివిల్‌ ఇంజినీరింగ్, ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, డేటా సైన్స్‌, ఏఐతో పాటు లా (బీఏ ఎల్‌ఎల్‌బీ), కామర్స్‌ అండ్‌ సైన్సెస్‌ (బీఏ/బీకాం/బీఎస్సీ), మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ-హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌), మాస్‌ కమ్యూనికేషన్‌, లైబ్రరీ సైన్స్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొంది ప్రస్తుతం ఈ కోర్సులు చదువుతున్న ఫుల్‌టైం యూజీ, పీజీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికై వారికి భారీ రహదారి ప్రాజెక్టుల ప్లానింగ్, అమలు, నిర్వహణ అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ అర్హతలు కలిగిన వారు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 15, 2026 చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రోగ్రామ్‌ అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us