నూరెళ్లు హాయిగా బతకాలంటే నానబెట్టిన బాదం ఈ టైంలో తినండి
27 March 2026
TV9 Telugu
TV9 Telugu
బాదం తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని కొంతమంది భావిస్తారు. ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి బాదం తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయి
TV9 Telugu
ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం కడుపు నిండుగా ఉండేలా చేసి ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది
TV9 Telugu
ఉప్మా, ఓట్‌మీల్, కిచిడీ, నూడుల్స్.. వంటి బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం పప్పును వేయడం లేదంటే బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత కొన్ని బాదం పప్పుల్ని తినడం వల్ల కడుపు నిండుగా అనిపించి చాలాసేపటి వరకు ఆకలేయకుండా ఉంటుంది
TV9 Telugu
పొట్ట తగ్గించుకునే క్రమంలో వివిధ వ్యాయామాలు చేయడం మామూలే. దాంతో పాటు రోజూ బాదం పప్పుల్ని కూడా తినడం అలవాటు చేసుకుంటే పొట్ట భాగంలో పెరిగిపోయిన కొవ్వుల్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు
TV9 Telugu
బాదంలోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరల్ని అదుపు చేస్తుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది. శరీరంలోని చెడు కొవ్వుల్ని తగ్గించి, మంచి కొవ్వుల్ని పెంచే శక్తి బాదం పప్పుకి ఉంది. తద్వారా బరువు అదుపులో ఉండడంతో పాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది
TV9 Telugu
రాత్రంతా నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. బాదం పప్పులు గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడతాయి
TV9 Telugu
ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ బాదం పప్పు తినడం ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
ముఖ్యంగా నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల మెదడు చురుకుగా మారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. బాదం పప్పులు శరీరానికి పుష్కలంగా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి