AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేద మంత్రోచ్ఛారణ, శంఖనాదం నడుమ నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం..!

నేపాల్‌లో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే, ర్యాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా 'బాలెన్', శుక్రవారం (మార్చి 27) నేపాల్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ నిరసనలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన సుమారు ఆరు నెలల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది.

వేద మంత్రోచ్ఛారణ, శంఖనాదం నడుమ నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం..!
Nepal Prime Minister Balen Shah
Balaraju Goud
|

Updated on: Mar 27, 2026 | 1:21 PM

Share

నేపాల్‌లో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే, ర్యాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా ‘బాలెన్’, శుక్రవారం (మార్చి 27) నేపాల్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ నిరసనలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన సుమారు ఆరు నెలల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పి) నాయకుడైన బాలేంద్ర, శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో మధ్యాహ్నం 12.34 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.

ఇంజనీర్ కూడా అయిన బాలెన్, హిమాలయ దేశంలో ఈ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడు. అలాగే మధేష్ ప్రాంతం నుండి ఈ అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (1) ప్రకారం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ శుక్రవారం ఉదయం ఆయనను 47వ ప్రధానమంత్రిగా నియమించారు.

బాలెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిందూ, బౌద్ధ మత సంప్రదాయాల విశిష్టమైన సమ్మేళనం కనిపించింది. బాలెన్‌కు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ వేడుకలో ఏడుగురు బ్రాహ్మణులచే శంఖనాదం, 108 మంది హిందూ బటుక్‌లు, యువ బ్రాహ్మణులచే వేద మంత్రాల పఠనం, స్వస్తి పఠనం, 107 మంది లామాలచే మంగళ పఠనం, బౌద్ధ గ్రంథ పఠనం వంటి విస్తృతమైన మతపరమైన ఆచారాలు పాటించారు.

ఆయన 15 నుండి 18 మంది మంత్రులతో కూడిన చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. తరాల మార్పు, అవినీతి రహిత పాలన కోరుతూ గత ఏడాది జరిగిన హింసాత్మక జెన్ జెడ్ నిరసనల తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో సంప్రదాయ పార్టీలను చిత్తుగా ఓడించింది. నేపాల్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాఠ్మండు మాజీ మేయర్, కొత్త నాయకుడు బలేంద్ర షా ‘బలేన్’ నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పిని ఎన్నుకుంది.

బాలెన్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆర్‌ఎస్‌పి, ప్రతినిధుల సభ (హెచ్‌ఓఆర్)లోని మొత్తం 275 స్థానాలకు గాను భారీగా 182 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (1) ప్రకారం మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అది అర్హత సాధించింది. హెచ్‌ఓఆర్‌లోని 275 మంది సభ్యులలో, 165 మంది ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా, 110 మంది దామాషా ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. గురువారం, హెచ్‌ఓఆర్‌కు కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలావుంటే, ఖాఠ్మండు మాజీ మేయర్ అయిన బాలెన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)కు దీర్ఘకాలంగా కంచుకోటగా ఉన్న ఝపా-5 నియోజకవర్గంలో, నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని భారీ మెజారిటీతో ఓడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్లెయిమ్‌ల నుండి పెన్షన్ వరకు.. ఈపీఎఫ్‌వోలో 10 కీలక మార్పులు ఇవే.
క్లెయిమ్‌ల నుండి పెన్షన్ వరకు.. ఈపీఎఫ్‌వోలో 10 కీలక మార్పులు ఇవే.
వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం
వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం
ఈ పాతకాలపు బెల్లం పాకం కూర తింటే రక్తహీనతకు గుడ్‌బై!
ఈ పాతకాలపు బెల్లం పాకం కూర తింటే రక్తహీనతకు గుడ్‌బై!
ఇంట్లో చెదపురుగులు పట్టాయని ఎలా గుర్తించాలి? ఫర్నిచర్‌ రక్షణ కోసం
ఇంట్లో చెదపురుగులు పట్టాయని ఎలా గుర్తించాలి? ఫర్నిచర్‌ రక్షణ కోసం
బొద్దింకలు బ్రహ్మాస్త్రం.. ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలు బ్రహ్మాస్త్రం.. ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే..
ఉదయాన్నే బెల్లం-శనగలు తింటే శరీరానికి సూపర్ బెనిఫిట్స్, తెలిస్తే
ఉదయాన్నే బెల్లం-శనగలు తింటే శరీరానికి సూపర్ బెనిఫిట్స్, తెలిస్తే
శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..
శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..
పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది
పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది
ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్..
ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్..
కారు క్యాబిన్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని ఆపి చూడగా
కారు క్యాబిన్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని ఆపి చూడగా