AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gardening Tips: మీ ఇంటి చుట్టు పక్కల రంద్రాల్లో పాములు ఉన్నాయనే డౌట్ ఉందా?.. ఎలా తెలుసుకోవాలంటే?

చాలా మంది ఇంటి పరిసరాల్లో చెట్ల, కూరగాయల, పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో గుబురుగా పిచ్చి మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ఈ ప్రాంతాల్లో రంద్రాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని పాములు, ఎలుకలు, పందికొక్కులు వంటివి ఆవాసాలుగా చేసుకొని నివసిస్తుంటాయి. కాబట్టి మీ ఇంటి చుట్టు పక్కల ఉండే రంద్రాల్లో పాములు ఉన్నాయనే డౌట్ మీకు వస్తే.. వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Mar 27, 2026 | 12:31 PM

Share
ఈ మధ్య కాలంలో ఇంటి ముందు, లేదా వెనకాల గార్డెన్స్ పెంచుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే పాములు, ఎలుకలు, పందికొక్కులు వంటివి బయట వేడిని తట్టుకోలేకి ఇలా ఇళ్లలో ఉండే గార్డెన్‌లను ఆవాసాలుగా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంటి పెరట్లో ఏవైనా రంధ్రాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.

1 / 5
అయితే ఇక్కడ జనాలకు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే.. చూడ్డానికి ఎలుకలు, పాములు చేసే రంద్రాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి దేనిలో పాములు ఉన్నాయో, దేనిలో ఎలుకలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ రెండింటిలో ఉండే చిన్న తేడాల ద్వారా మీరు పాము రంద్రాన్ని  వేరుగా గుర్తించవచ్చు.

2 / 5
మీ పెరట్లో రంద్రాలు కనిపించిన వెంటనే అందులో పాములు ఉంటాయనుకోవడం పొరపాటు. అసలు విషయం ఏమిటంటే పాములు రంద్రాలు చేయవు.. కేవలం చీమలు, లేదా ఎలుకలు చేసిన రంద్రాల్లోనే అవి నివసిస్తూ ఉంటాయి. పాముల్లో నాగు పాములు మాత్రమే గూడును ఏర్పాటు చేసుకుంటాయి. అవి కూడా చెట్టుకొమ్మలు లేదా ఆకులై, నేలపై కాదు. నేలపై రంద్రాలు ఉన్నాయంటే అవి కచ్చితంగా పందికొక్కులో లేదా, ఎలుకలో చేసినవి అయి ఉంటాయి.

3 / 5
సాధారణంగా ఎలుకలు 2-3 ఇంచులు లేదా అంతకన్నా ఎక్కువ వెడల్పగా ఉంటే రంద్రాలను చేస్తాయి. ఎలుకలు, పందికొక్కులు చేసే రంధ్రాలు చూడ్డాన్ని గందరగోళంగా అప్పుడే తవ్వినట్టు కనిపిస్తాయి. కానీ పాములు నివాసం ఉండే రంధ్రాలు మాత్రం చూడ్డానికి నీటుగా, స్మూత్‌గా కనిపిస్తాయి. పక్క పోటి ఎలాంటి మట్టి కనిపించదు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. మీ గార్డెన్‌లో రంద్రాల చుట్టు పక్కలు మొక్కల్ని కొరికిన ఆనవాళ్లు ఉంటే వాటిలో ఎలుకలు ఉంటే అవకాశం ఉంది.

4 / 5
కానీ ఆ రంద్రంలో పాములు ఉన్నట్లయితే బయట పాము చర్మం(కుబుసం) ఆనవాళ్లు ఉండే ఛాన్స్ ఉంది. అలాగే తెలుపు రంగులో విసర్జన పదార్థాలు కూడా ఉండొచ్చు. అంతేకాదు నేలపై పాము పాకిన గుర్తులు కూడా మీకు కనిపిస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఉండే రంద్రాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.. మీకు పాము ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వండి. అనవసరంగా మీరు వాటి జోలికి వెళ్లకండి. అలాగే పొరపాటున కూడా ఆ రంద్రాల్లో చేతులు పెట్టడం వంటివి చేయకండి. అలాగే గార్డెన్‌ను నీటుగా ఉంచుకునేందుకు ట్రై చేయండి. ( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 ధృవీకరించడం లేదు.

5 / 5
Follow Us