AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Detox Juice: ఉదయాన్నే ఖాళా కడుపుతో గ్లాసుడు ఈ జ్యూస్ తాగారంటే.. మీ లివర్‌ తళతళలాడాల్సిందే!

నేటి తప్పుడు జీవనశైలి కారణంగా కాలేయంపై అధిక భారం పడుతుంది. మద్యం, అధిక ప్రోటీన్ తీసుకునే వారు కాలేయంపై భారాన్ని పెంచి దాని పనితీరును ప్రభావితం చేస్తున్నారు. కానీ కాలేయం పనితీరును మెరుగుపరచడానికి ఆయుర్వేదం అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా నేలి కాలంలో ఫ్యాటీ లివర్..

Liver Detox Juice: ఉదయాన్నే ఖాళా కడుపుతో గ్లాసుడు ఈ జ్యూస్ తాగారంటే.. మీ లివర్‌ తళతళలాడాల్సిందే!
Magical Juice For Liver Detox
Srilakshmi C
|

Updated on: Mar 27, 2026 | 1:04 PM

Share

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో 50కి పైగా విధులను నిర్వర్తించే ఒక ముఖ్యమైన అవయవం. హార్మోన్ల ఉత్పత్తి, ప్రోటీన్ల సంశ్లేషణ వంటి కీలక విధులు కాలేయం లేకుండా శరీరం నిర్వర్తించలేదు. అయితే నేటి తప్పుడు జీవనశైలి కారణంగా కాలేయంపై అధిక భారం పడుతుంది. మద్యం, అధిక ప్రోటీన్ తీసుకునే వారు కాలేయంపై భారాన్ని పెంచి దాని పనితీరును ప్రభావితం చేస్తున్నారు. కానీ కాలేయం పనితీరును మెరుగుపరచడానికి ఆయుర్వేదం అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా నేలి కాలంలో ఫ్యాటీ లివర్ ఒక సాధారణ సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ కాలేయాన్ని నిర్విషీకరణ చేసి, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆయుర్వేధ చిట్కాలు ఉన్నాయి.

క్యారెట్ జ్యూస్

క్యారెట్లు, ఆపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, పుదీనాను కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. అయితే ఈ జ్యూస్ తయారుచేసేటప్పుడు అందులో చక్కెర లేదా ఉప్పు కలపకూడదు. ఈ జ్యూస్‌ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి. ఈ జ్యూస్ ఫ్యాటీ లివర్‌కు మాత్రమే కాకుండా కామెర్లకు కూడా మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

క్యారెట్

క్యారెట్లు కాలేయ కణాలను బలపరిచి, వాటిని నష్టం నుంచి కాపాడతాయి. క్యారెట్లలోని పదార్థాలు కాలేయంపై ఉండే అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

యాపిల్

ఆపిల్స్‌లోని గుణాలు కాలేయ వాపును తగ్గించడంలో, కణాల పునరుత్పత్తిలో సహాయపడతాయి.

ద్రాక్ష

ద్రాక్ష పండ్లు కాలేయంలో ఎంజైమ్‌లను పెంచుతాయి. ఇవి ప్రోటీన్ల జీర్ణక్రియ, సంశ్లేషణకు సహాయపడతాయి.

పుదీనా

పుదీనా ఈ జ్యూస్ రుచిని పెంచడమే కాకుండా, కాలేయంలో తలెత్తే సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మొత్తంగా ఈ జ్యూస్ కాలేయాన్ని ఉత్తేజపరిచి, అది పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏమి తినాలి?

కాలేయ ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడతాయి. అలాగే, సూర్యాస్తమయం తర్వాత తినడం మానుకోవాలి. మీకు ఆకలిగా అనిపిస్తే కిచిడీ లేదా సూప్ వంటి తేలికపాటి భోజనం చేయాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us