AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Result Date 2026: ఇంటర్ విద్యార్ధులు అలర్ట్.. ఇంకాస్త ముందుగానే ఇంటర్ ఫలితాలు విడుదల! రిజల్ట్స్ తేదీ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 25తో ముగిసిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. అనంతరం చకచకా మార్పుల నమోదు ప్రక్రియ పూర్తి చేసిన..

AP Inter Result Date 2026: ఇంటర్ విద్యార్ధులు అలర్ట్.. ఇంకాస్త ముందుగానే ఇంటర్ ఫలితాలు విడుదల! రిజల్ట్స్ తేదీ ఇదే
AP Inter Result date
Srilakshmi C
|

Updated on: Mar 27, 2026 | 1:41 PM

Share

అమరావతి, మార్చి 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 25తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 10,57,312 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్ విద్యార్ధులు 5,31,275 మందికి గాను 5,21,266 మంది హాజరయ్యారు. అలాగే సెకండ్ ఇయర్ 5,26,264 మందికి గాను 5,16,646 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్‌ కూడా ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. అనంతరం చకచకా మార్పుల నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ఏప్రిల్ 21లోపు ఇంటర్ ఫలితాలను వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. మే తొలి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నందున.. ఈ మేరకు ఏప్రిల్‌ మూడో వారంలో ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఇటీవల ప్రభుత్వం పలు కీలక సూచనలు జారీ చేసింది. సమాధానం సరిగా ఉంటే చేతిరాతను చూసి మార్కులు తగ్గించకూడదని స్పష్టం చేసింది. మూల్యాంకనం పూర్తయ్యాక తిరిగి పరిశీలించి, మార్కులు స్పష్టంగా బబుల్‌ చేయాలని సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసే సిబ్బందికి సూచించింది. అలాగే మూల్యాంకనంలో పొరపాట్లు వస్తే సిబ్బందికి భారీగా జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. పేపరు మూల్యాంకనం చేసిన వారికి రూ.3,000 నుంచి రూ.7,500 వరకూ, పరిశీలించిన వారికి రూ.2,000 నుంచి రూ.3,750 వరకూ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. మూల్యాంకనం తర్వాత మార్కులు తప్పుగా వేస్తే మూల్యాంకనం నుంచి డీబార్‌ చేస్తామని స్పష్టం చేసింది.

ఫలితాలు వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌తోపాటు AP వాట్సాప్ మిత్ర 91 95523 00009 నంబర్‌ ద్వారా కూడా నేరుగా తెలుసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ వెబ్సైట్ ద్వారా సందర్శించి ఫలితాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us