Chicken vs Mutton: చికెన్ లేదా మటన్.. సమ్మర్‌లో ఏది తినడం మంచిది! ఆరోగ్యంగా ఎలా వండుకోవాలి!
Chicken vs Mutton in Summer: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరిగే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీర ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో జీర్ణక్రియ మందగిస్తుంది, కాబట్టి సులభంగా అరిగే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సమ్మలోనే చాలా మంది నాన్‌వెజ్ తినేందుకు ఇష్టపడతారు. అయితే సమ్మర్ చికెన్ తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని అనుకుంటారు. కాబట్టి వేసవిలో చికెన్ లేదా మటన్ ఏది తినడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో చికినెన్ తినడం వల్ల శీరంలో వేడి పెరుగుతుందని, అందుకే వేసవిలో చికన్ తినడం కన్నా మటన్ బెస్ట్ అని చాలా మంది అనుకుంటారు. మీకు అలాంటి డౌట్ ఉంటే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సింది. చికెన్‌లో ప్రోటీన్ ఉండటం వల్ల అది సులభంగా జీర్ణమవుతుంది. ఇది శరీరంలో తక్కువ వేడిని సృష్టిస్తుంది. మటన్ జీర్ణం కావడం చాలా కష్టం కాబట్టి చాలా మంది దానిని తినడానికి దూరంగా ఉంటారు. మనం తినే ఆహారాలు మన శరీర తత్వానికి అనుగుణంగా శరీరంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, మాంసాహారం వండేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చికెన్, మటన్ రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరి వేసవిలో చికెన్ లేదా మటన్ ఏది తినాలా? మాంసాహారాన్ని సరైన పద్ధతిలో ఎలా వండుకోవాలో చూద్దాం.
చికెన్ వర్సెస్ మటన్
చికెన్: చికెన్‌ను ‘లీన్ ప్రోటీన్’గా పరిగణిస్తారు. ఇందులో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండటం వల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది. వేసవిలో మన జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది, అటువంటప్పుడు చికెన్ తినడం వల్ల శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడదు, శరీరంలో వేడి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. వేసవిలో శరీరాన్ని తేలికగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి చికెన్ ఉత్తమం. బరువు తగ్గాలనుకునే వారికి, కండరాల పుష్టి కోరుకునే వారు చికెన్ మంచి ఎంపిక.
మటన్: మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో పీచు పదార్థం, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం దీనిని అరిగించడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, వేసవిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.చికెన్ కంటే మటన్‌లో ఐరన్, జింక్, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారు లేదా కష్టపడి పనిచేసే వారు మటన్ తీసుకోవడం మంచిది.
వేసవిలో చికెన్ లేదా మంటన్ వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఏదైనా మాంసాహారం తెచ్చుకున్న తర్వాత, దానిని ముందుగా సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. చికెన్ వండేటప్పుడు ఎక్కువ నూనె వేయవద్దు. మరీ ఎక్కువ నూనెతో కూడిన చికెన్ గ్రేవీ లేదా చికెన్ ఫ్రై అస్సలు వండవద్దు. చికెన్ వండే ముందు, మ్యారినేట్ చేయడానికి పెరుగు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ వంటి చల్లని పదార్థాలను ఉపయోగించడం మంచింది. ఇది ఆహారంలోని వేడిని తగ్గిస్తుంది.
అలాగే వేసవి రోజుల్లో మటన్ తినడం మానుకోండి. మటన్ వండేటప్పుడు, ముందుగా దానిని కుక్కర్‌లో వేసి 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇది కాకుండా, మటన్ వండేటప్పుడు అల్లం, వెల్లుల్లి, సోంపు, జీలకర్ర వంటి మసాలా దినుసులను ఉపయోగించాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు సహాయపడుతాయి.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం ఏదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
