వేసవిలో మీ పొట్ట చల్లగా ఉండాలంటే.. రోజూ బొప్పాయి ఇలా తినండి

27 March 2026

TV9 Telugu

TV9 Telugu

బొప్పాయి జీర్ణక్రియకు చాలా మేలైన పండు. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్లు, ఎంజైమ్‌లు ఆరోగ్యకరమైన కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి

TV9 Telugu

బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల కడుపు భారం తగ్గి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

బొప్పాయిలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. ప్రతిరోజూ బొప్పాయి తినడం వల్ల క్రమంగా మలబద్ధకం తగ్గి, ప్రేగులు శుభ్రంగా ఉంటాయి

TV9 Telugu

బొప్పాయి కడుపులోని ఆమ్లతను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల గుండెల్లో మంట, పుల్లటి త్రేనుపులు తగ్గుతాయి. ఇది కడుపును చల్లబరుస్తుంది

TV9 Telugu

బొప్పాయి కడుపులోని గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అందుకే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తేలికగా అనిపించి, ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

బొప్పాయి పేగులను శుభ్రపరుస్తుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది ఇతర కడుపు సమస్యలను సైతం నివారించడంలో సహాయపడి, జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది

TV9 Telugu

రోజుకు ఒక గిన్నె బొప్పాయి ముక్కలు తింటే సరిపోతుంది. పరగడుపున లేదా బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత బొప్పాయి తినకపోవడమే మంచిది. దానిని ఎల్లప్పుడు పండిన తర్వాత మాత్రమే తినాలి. అయితే మంచిది కదాని ఎక్కువ పరిమాణంలో తినడం హానికరం

TV9 Telugu

అయితే కామెర్లు, ఆస్తమా పచ్చ కామెర్లు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బొప్పాయిలో ఉండే పపైన్, బీటా కెరోటిన్ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి