Telangana: గుడ్‌ న్యూస్‌.. రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు న్యూట్రిషన్‌ కిట్లు. రూ. 2 వేల విలువ చేసే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్‌ కిట్లను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఆదివారం నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సంతకం చేశారు. ఇదిలా ఉంటే గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని జయించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గతేడాది..

Telangana: గుడ్‌ న్యూస్‌.. రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు న్యూట్రిషన్‌ కిట్లు. రూ. 2 వేల విలువ చేసే..
KCR Nutrition Kit
Follow us

|

Updated on: Apr 30, 2023 | 7:46 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్‌ కిట్లను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఆదివారం నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సంతకం చేశారు. ఇదిలా ఉంటే గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని జయించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గతేడాది న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట్లో కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 6.84లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లు అందనున్నాయి. పోషకాహార లోపం, రక్తహీనతను జయించాలే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన ఈ కిట్‌లో కిలో ఖర్జూరాలు, ఐరన్ సిరప్ రెండు బాటిళ్లు, నెయ్యి 500 గ్రాములు, అల్బెండజోల్ ట్యాబెట్లు ఒక కప్పు, హార్లిక్స్ రెండు బాటిళ్ల చొప్పున ఈ కిట్‌లో ఇవ్వనున్నారు. రూ. 2 వేలు విలువ చేసే ఈ కిట్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఏడాదిలో రెండుసార్లు ఈ న్యూట్రిషన్ కిట్లను అందించనున్నారు.

తొలి దశలో ఈ పథకాన్ని రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ జిల్లాల్లో పథకం విజయవంతంగా అమలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.84 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!