Telangana Cabinet: ప్రభుత్వంలో TSRTC విలీనం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు.. ఎమ్మెల్సీలుగా..
Telangana Cabinet Meeting: టీఎస్ఆర్టీసీ.. మెట్రో విస్తరణ, ఎయిర్‌పోర్టు.. అభివృద్ధి ఇలా ఎన్నో కీలక విషయాలు.. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం చేస్తూ.. తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. వచ్చే అసెంబ్లీ సెషన్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

హైదరాబాద్, జులై 31: టీఎస్ఆర్టీసీ.. మెట్రో విస్తరణ, ఎయిర్‌పోర్టు.. అభివృద్ధి ఇలా ఎన్నో కీలక విషయాలు.. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం చేస్తూ.. తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. వచ్చే అసెంబ్లీ సెషన్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. తెలంగాణ మంత్రి మండలి సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీని విలీనం చేయనున్నామని.. వచ్చే అసెంబ్లీ సెషన్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణాను పటిష్టపరిచేందుకు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తాం.. కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నాం ఆగస్ట్ 3న ప్రారంభమయ్యే సమావేశాల్లో.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును ప్రవేశపెడుతున్నామంటూ పేర్కొన్నారు.
భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైందని.. వరద నష్టాన్ని సైతం కేబినెట్‌లో చర్చించామని కేటీఆర్ తెలిపారు. వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్‌లో.. భారీ వర్షాలు కురిశాయి.. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది.. రోడ్లకు వెంటనే తాత్కాళిక మరమ్మతులు.. విద్యుత్ వీరులకు పంద్రాగస్టు నాడు సత్కారం.. 45మంది పిల్లలను కాపాడిన వారికి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మంలో మున్నేరు వెంట రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీనిచ్చారు. ఖరీప్ నేపథ్యంలో వెంటనే విత్తనాల సరఫరా ప్రారంభిస్తామని తెలిపారు. వరదల్లో మరణించిన 45మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీలుగా..
గవర్నర్ కోటా కింద MLCకి ఇద్దరి పేర్లను కేబినెట్ సూచించిందని.. వారి పేర్లను గవర్నర్ కు పంపనున్నట్లు తెలిపారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కేబినెట్ నిర్ణయించింది.. కేబినెట్ నిర్ణయించిన తర్వాత గవర్నర్ ఆమోదించాల్సిందే.. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తామని కేటీఆర్ వివరించారు.




మెట్రో విస్తరణ..
హైదరాబాద్ మెట్రోరైలుపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది.. మెట్రోరైలును మరింత విస్తరిస్తున్నాం.. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ నడుస్తుందని తెలిపారు. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు – ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు -ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు – షాద్ నగర్ వరకు – ఉప్పల్ నుంచి ECIL క్రాస్ రోడ్డు వరకు – శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
మరో ఎయిర్‌పోర్ట్ కోసం..
వరంగల్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు దక్షిణాన శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఉంది.. మరో ఎయిర్‌పోర్టును నిర్మించాలని నిర్ణయించామన్నారు. హకీంపేట ఎయిర్‌పోర్టును పౌర విమానయానానికి వినియోగించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. రక్షణశాఖ నడిపినా.. కేంద్రం నడిపినా మాకు అభ్యంతరం లేదని కేటీఆర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
