TREIRB Exams: రేపట్నుంచే గురుకుల టీచర్‌ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు.. బూట్లతో వెళ్తే నో ఎంట్రీ!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షలు జరనున్నయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 104 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే హాల్‌టికెట్లు కూడా విడుదలయ్యాయి. మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ప్రతి సెషన్‌లో పరీక్ష 2 గంటలు ఉంటుంది. ఉదయం షిఫ్టు 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం..

TREIRB Exams: రేపట్నుంచే గురుకుల టీచర్‌ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు.. బూట్లతో వెళ్తే నో ఎంట్రీ!
TREIRB Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 31, 2023 | 9:17 PM

హైదరాబాద్, జులై 31: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షలు జరనున్నయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 104 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే హాల్‌టికెట్లు కూడా విడుదలయ్యాయి.

మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ప్రతి సెషన్‌లో పరీక్ష 2 గంటలు ఉంటుంది. ఉదయం షిఫ్టు 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టు 4.30 నుంచి 6.30 గంటల వరకు మూడో షిఫ్టు పరీక్ష జరుగుతుంది. టీజీటీ, ఎస్‌జీబీటీ, పీఈటీ పోస్టుల రాత పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.66 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు నియామక బోర్డు ముఖ్య సూచనలు జారీ చేసింది. అవేంటంటే..

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన సూచనలివే..

  • అభ్యర్థులందరూ నిర్ణీత సమయంలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి షిఫ్టు పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు.
  • ఒక్కసారి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తే ఆ తరువాత పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు.
  • పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమతోపాటు హాల్‌టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలి. గుర్తింపు కార్డు లేకుంటే పరీక్ష గదిలోకి అనుమతి ఉండదు. ఒక వేళ హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్‌ కాకుంటే మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌
  • ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ, అండర్‌టేకింగ్‌ ధ్రువీకరణ పత్రం తీసుకుని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
  • ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు. బూట్లు ధరించిన అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. చెప్పులు మాత్రమే ధరించాలి.
  • హాల్‌టికెట్‌, గుర్తింపు కార్డు, నామినల్‌ రోల్‌లలో ఫొటోలు వేర్వేరుగా ఉన్నా అధికారులు అనుమతించరు
  • పరీక్ష పేపర్‌ 1, 2, 3లో తప్పుగా రాసిన ప్రతి సమాధానానికి పావు(0.25) మార్కు కోత ఉంటుంది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.