TSPSC Group 1 Answer Key: ఆగస్టు చివరివారం నుంచి వరుసగా పరీక్ష ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్సీ కసరత్తు.. రేపు గ్రూప్ 1 తుది ‘కీ’
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆన్సర్ కీ విడుదలకు ఆధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సైతం వరుసగా ప్రకటించనుంది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడనుంది..
హైదరాబాద్, జులై 31: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆన్సర్ కీ విడుదలకు ఆధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సైతం వరుసగా ప్రకటించనుంది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడనుంది.
రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబరు మొదటివారం నుంచి వరుసగా ఫలితాలను వెల్లడించేలా కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలో న్యాయవివాద అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా తుది ఆన్సర్ ‘కీ’లను వెల్లడించనుంది. 1:2 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటించనుంది. అలాగే మెరిట్ జాబితాలోని అభ్యర్ధులకు వీలైనంత త్వరగా ధ్రువీకరణ పత్రాలన చేపట్టి.. ఆ తర్వాత ఆయా ఉద్యోగాలకు సంబంధించిన తుది ఫలితాలను వరుసగా ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.