Telangana Cabinet: ఆ నలుగురు ఎవరు..? తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్..
ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురుచూస్తోన్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం దగ్గరపడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి ఆమోద ముద్ర పడింది. ఐతే కేబినెట్‌లో రెండు బెర్త్‌లను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురుచూస్తోన్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం దగ్గరపడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి ఆమోద ముద్ర పడింది. ఐతే కేబినెట్‌లో రెండు బెర్త్‌లను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం, కాంగ్రెస్ కీలక నేతలతో ఢిల్లీలో సోమవారం సుదీర్ఘ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. అధిష్టానంతో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. పార్టీ బలోపేతంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. అన్ని విషయాలతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
మార్పు నినాదంతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరయింది. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ఆశవహులను ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంత్రులు వున్నారు. లెక్క ప్రకారం కేబినెట్‌లో మరో ఆరుగురికి చోటు వుంటుంది. రెండు పెండింగ్‌లో పెట్టాలనే నిర్ణయం జరిగినట్టు చర్చజరుగుతోంది.ఆ లెక్కన మంత్రి పదవి దక్కనున్న ఆ నలుగురు ఎవరన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడకోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ తన ఆవాజ్ విన్పించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండందండలతో గట్టిగా ప్రయత్నాలు చేశారనేది టాక్..
అల్రెడీ నల్లగొండ జిల్లా నుంచి కేబినెట్‌లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిర్‌బీ తనకు చాన్స్ పక్కా అనే ధీమాతో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరోవైపు వివేక్ వెంకటస్వామి, పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం వుండొచ్చనే ప్రచారం తెరపైకి రానే వచ్చింది. ప్రొఫెసర్ కోదండరామ్ పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి లేకపోవడం వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ తనకు కేబినెట్‌లో చోటివ్వాలని చెప్పకనే చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి .తనకు చాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం కూడా ప్రయోగించారు.. ఇక మైనార్టీ కోటా నుంచి కూడా కాంపిటేషన్ ఎక్కువగానే ఉంది.
లైన్‌లో అలా ఎందరో ఆశవహులు ఉన్నారు. మరి వారిలో కేబినెట్ బెర్త్ చేజిక్కించుకునే ఆ నలుగురు ఎవరు? ఉగాది తెలంగాణ కేబినెట్ విస్తరణ ఖాయమనే సంకేతాలయితే వచ్చేశాయి. మరోవైపు ఏప్రిల్ 8,9న గుజరాత్‌లో జరిగే ఏఐసీసీ సమావేశాల కోసం రణదీప్ సూర్జేవాల నేతృత్వంలో 15 మందితో కమిటీ నియమించారు. అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చోటు దక్కింది. మరి ఉగాది వేళ మంత్రిగిరికి సంబంధించి తీపి కబురు ఎవరికి? టఫ్ కాంపిటేషన్ నేపథ్యంలో రాజపూజ్యం-అవమానాలు..అసంతృఫ్తులు ఏ రేంజ్‌లో ఉంటాయోననే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..