Telangana BJP: బీజేపీకి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా.. కారణం ఏంటంటే..
పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ అన్న విక్రమ్ గౌడ్.. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని, అందుకే ఆవేదనతో బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ ఆ లేఖను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు..

పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని, క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్దనాయకులు కొట్టుకుంటున్నా చోద్యం చూస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ అన్న విక్రమ్ గౌడ్.. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని, అందుకే ఆవేదనతో బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ ఆ లేఖను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.
విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. బలమైన గౌడ సామాజిక వర్గం కావడం, గతంలో ముఖేష్ గౌడ్ సిటీలో బడా లీడర్ కావడంతో విక్రమ్ గౌడ్ బీజేపీని వీడటం గ్రేటర్ లో ఆ పార్టీకి దెబ్బేనని పలువురు నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో పార్టీ పెద్దలు విక్రమ్ గౌడ్‌కు పార్టీని వీడవద్దని నచ్చజెప్పారు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం అధిష్టానం కల్పిస్తుందని భావించినప్పటికీ ఎలాంటి హామీరాకపోవటంతో అసంతృప్తితో ఉన్న విక్రమ్ గౌడ్ తాజాగా పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




